Prabhas: వారి స్థానంలో నేనున్నా అలానే ఆలోచిస్తా.. పెళ్లి వార్తలపై ప్రభాస్ రిప్లై

మరో సారి ఈ రెబల్‌ స్టార్‌కు పెళ్లి గురించిన ప్రశ్న ఎదురైంది

Published : 17 Apr 2022 02:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌గా పేరున్న ప్రభాస్‌ పెళ్లి వార్త ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గానే మారుతుంది. బాహుబలి తర్వాత ఈ హీరోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ప్రభాస్‌ పెళ్లి కోసం వారంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాధేశ్యామ్‌ విడుదల సందర్భంగా ప్రేమ విషయంలో తన అంచనాలు తప్పాయని ఈ హీరో చెప్పడం చర్చనీయాంశమైంది. తాజాగా మరో సారి ఈ రెబల్‌ స్టార్‌కు పెళ్లి గురించిన ప్రశ్న ఎదురైంది.

‘ప్రభాస్‌ మీ పెళ్లెప్పుడు?’అంటూ ఓ ఇంటర్వ్యూలో అడగగా ఎప్పటిలాగే చిలిపి సమాధానంతో దాటవేశాడు. ’దానికి నా దగ్గర ఇప్పుడు సమాధానం లేదు. నాకు తెలిసినప్పుడు అందరికీ చెప్తాను’అంటూ నవ్వేశాడు. ‘ఎక్కడకు వెళ్లినా మీ పెళ్లి గురించే  అడుగుతుంటారు. అది మీకు చిరాకు తెప్పించదా?’అనే మరో ప్రశ్నకుస్సందిస్తూ.. ‘లేదు నాకెప్పుడూ చిరాకు అనిపించదు. నేను అర్థం చేసుకోగలను వారు నా గురించి ఎంతలా ఆలోచిస్తారో అని.. అయినా అలా అడగడం సాధారణ విషయమే. వారి స్థానంలో నేనున్నా అలానే ఆలోచిస్తా’అంటూ కూల్‌గా రిప్లై ఇచ్చాడు. కేజీయఫ్-2 తరవాత ప్రశాంత్‌ నీల్- ప్రభాస్‌ కలయికలో ‘సలార్‌’ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను హోంబళే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని