Adipurush: విమర్శలపై ‘ఆదిపురుష్’ టీమ్ ఫోకస్.. ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు..?
ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన భారీ ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ముంబయి: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘ఆదిపురుష్’ (Adipurush). ఓంరౌత్ (Om Raut) దర్శకుడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం మొదటి నుంచి భావించినప్పటికీ అనుకోని కారణాల వల్ల వాయిదాపడినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు.
ఇదిలా ఉండగా, ‘ఆదిపురుష్’ రిలీజ్‌పై తాజాగా పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతోన్నాయి. ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని ఆయా వార్తల్లోని సమాచారం. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన విమర్శలపై ఫోకస్ చేసిన చిత్రబృందం.. టెక్నికల్ అంశాలపై దృష్టి పెట్టిందని.. ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు పెట్టి మరోసారి వీఎఫ్‌ఎక్స్, సీజీ పనులు చేయిస్తోందని బీటౌన్ టాక్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సమ్మర్‌లో కూడా థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదని ఆయా కథనాల్లోని సారాంశం.
రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ‘ఆదిపురుష్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో, సీతగా కృతిసనన్ నటించారు. రామాయణంలో కీలకపాత్రగా భావించే రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. దసరా వేడుకల్లో భాగంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాము ఊహించిన స్థాయిలో టీజర్ లేదని, లంకేశ్వరుడు, హనుమంతుడు లుక్స్, వీఎఫ్‌ఎక్స్ అంతగా బాగోలేదని విమర్శించారు. దీంతో టీమ్.. ఇప్పుడు తప్పులను సరిచేసే పనిలో పడినట్లు సమాచారం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
TikTok: టిక్‌టాక్ బ్యాన్‌తో నాకూ లాభమే: జస్టిన్ ట్రూడో
-
Politics News
సావర్కర్‌ను అవమానించిన రాహుల్‌ను శిక్షించాలి: ఏక్నాథ్ శిందే
-
Movies News
celebrity cricket league: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ విజేత ‘తెలుగు వారియర్స్’
-
Movies News
Avatar 2 OTT Release Date: ఓటీటీలో అవతార్ 2.. ప్రీబుకింగ్ ధర తెలిస్తే వామ్మో అనాల్సిందే!
-
Politics News
YSRCP: అన్నీ ఒట్టి మాటలేనా?.. వైకాపా ఎమ్మెల్యేకు నిరసన సెగ
-
Sports News
Ashwin: మాది బలమైన జట్టు..విమర్శలపై ఘాటుగా స్పందించిన అశ్విన్