Prabhas: అభిమానితో వీడియోకాల్‌లో మాట్లాడిన ప్రభాస్‌

ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రాలు ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ షూటింగ్‌తో బిజీబిజీగా ఉన్న ప్రభాస్‌.. ఇటీవలి కాలంలో మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నారు. పెద్దగా కెమెరా ముందు కనిపించని ఈ డార్లింగ్‌ తన అభిమాని కోసం వీడియో కాల్‌లో మాట్లాడి ఆమె ముఖంపై నవ్వులు కురిపించారు. కొన్నిరోజుల క్రితం శోభిత అనే అమ్మాయి అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని స్పార్ష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇక డాక్టర్లు ఆమె ఇష్టాఇష్టాలను

Published : 18 Sep 2021 20:31 IST

ఆమెకు ఆనందం

హైదరాబాద్‌: ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రాలు ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ షూటింగ్‌తో బిజీబిజీగా ఉన్న ప్రభాస్‌.. ఇటీవలి కాలంలో మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నారు.  ఈ డార్లింగ్‌ తన అభిమాని కోసం వీడియో కాల్‌లో మాట్లాడి ఆమె ముఖంపై నవ్వులు కురిపించారు. కొన్నిరోజుల క్రితం శోభిత అనే అమ్మాయి అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని  ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇక డాక్టర్లు ఆమె ఇష్టాఇష్టాలను తెలుసుకోగా.. ప్రభాస్‌ అభిమానినని, ఆయనతో మాట్లాడాలని ఉందని చెప్పింది. శోభిత కోరిక మేరకు ప్రభాస్‌తో మాట్లాడించే ప్రయత్నం చేయగా.. శనివారం ప్రభాస్‌ వీడియో కాల్‌ చేసి  మాట్లాడి ఆమెకు ఆనందాన్ని పంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని