Prabhas: రామ్‌చరణ్‌, తారక్‌తో పోటీపై ప్రభాస్‌ కామెంట్స్

‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’.. ఇలా వరుస పాన్‌ ఇండియన్‌ ప్రాజెక్ట్‌లతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు ప్రభాస్‌. ‘రాధేశ్యామ్‌’ విడుదల అనంతరం షూట్స్‌ నుంచి...

Published : 16 Apr 2022 02:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’.. ఇలా వరుస పాన్‌ ఇండియన్‌ ప్రాజెక్ట్‌లతో అలరించేందుకు సిద్ధమయ్యారు నటుడు ప్రభాస్‌. ‘రాధేశ్యామ్‌’ అనంతరం కాస్త విరామం తీసుకున్న ఆయన విదేశాలకు వెళ్లారు. తన తదుపరి చిత్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కించిన ‘కేజీయఫ్‌-2’ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకోవడంపై ప్రభాస్‌ స్పందించారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

రామ్‌చరణ్‌, తారక్‌, యశ్‌లతో పాన్‌ ఇండియా స్థాయిలో పోటీ పెరిగిందని భావిస్తున్నారా..? అని ప్రశ్నించగా.. ‘‘మనం మరిన్ని చిత్రాలు తెరకెక్కించాలి. అదే విధంగా క్రాస్‌ ఇండియన్‌ సినిమాలపై కూడా మరింత దృష్టి పెట్టాలి. పాన్‌ ఇండియా సినిమాలు మంచి విజయం సాధించడం వల్ల ఆయా హీరోలతో నాకు పోటీ పెరిగిందని నేను భావించను. ఎందుకంటే.. ఉత్తరాది, దక్షిణాది ఇలా పరిశ్రమ ఏదైనా.. అందరం కలిసి మరిన్ని పాన్‌ ఇండియా చిత్రాలు రూపొందిస్తే బాగుంటుందని నమ్ముతున్నా’’

‘‘ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూశా. నాకెంతో నచ్చేసింది. అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో భారతీయ చిత్రం ఇదే కావడం ఆనందంగా ఉంది. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌, అందులోనూ రాజమౌళి తెరకెక్కించడంతో ఈ సినిమా అన్ని చోట్ల మంచి సక్సెస్‌ని సొంతం చేసుకుంది. రాజమౌళి ఇప్పుడు దక్షిణాది దర్శకుడు కాదు. ఆయన ఇప్పుడు భారతీయ దర్శకుడు. అలాగే ‘కేజీయఫ్‌-2’ కూడా బ్లాక్‌బస్టర్‌ కావడం, ప్రశాంత్‌నీల్‌ వంటి బిగ్గెస్ట్‌ డైరెక్టర్‌తో వర్క్‌ చేస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది’’ అని ప్రభాస్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని