ప్రభాస్‌ అలా నాకు క్లాస్‌మేట్‌!

నటుడు శ్రీను తెలుసా? అని అడిగితే ‘ఏ శ్రీను’ అంటారు. అదే ‘ప్రభాస్‌ శ్రీను’ అని చెబితే గుర్తు పట్టని

Updated : 30 Mar 2021 15:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు శ్రీను తెలుసా? అని అడిగితే ‘ఏ శ్రీను’ అంటారు. అదే ‘ప్రభాస్‌ శ్రీను’ అని చెబితే గుర్తు పట్టని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. తనదైన నటన, కామెడీ టైమింగ్‌తో అలరిస్తున్న నటుడాయన. సినిమాల్లో హీరోలకు దమ్కీ ఇస్తూ ఆ తర్వాత వారి చేతుల్లోనే దెబ్బలు తినే సన్నివేశాల్లో ఆయన హావభావాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. శ్రీను.. ‘ప్రభాస్‌ శ్రీను’ ఎలా అయ్యాడో ఓ సందర్భంలో పంచుకున్నారాయన.

‘‘నాకు చిన్నప్పటి నుంచి చదువు పెద్దగా అబ్బలేదు. అయితే, సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొనేవాడిని. యాక్టింగ్‌తో పాటు ఇతర కల్చరల్‌ యాక్టివిటీస్‌ బాగా చేసేవాడిని. ఇదే విషయాన్ని మా నాన్న తన స్నేహితుడికి చెప్పడంతో.. ‘మధు  ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌’లో చేరమన్నారు. అలా కొన్ని రోజులు నటనలో అక్కడ శిక్షణ తీసుకున్నా. అప్పుడు పెద్ద సినిమా కష్టాలేమీ ఎదుర్కోలేదు. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టా. పెద్దగా అవకాశాలు ఏవీ రాలేదు’’

‘‘ఆ సమయంలో మా నాన్న విశాఖ ఆర్డీవోగా పనిచేస్తున్నారు. సత్యానంద్‌గారి దగ్గర కూడా శిక్షణ తీసుకుంటే బాగుంటుందనిపించింది. అయితే, ఆయన చాలా తక్కువ మందికి మాత్రమే శిక్షణ ఇస్తారు. నాన్నగారి విన్నపం మేరకు సత్యానంద్‌గారు నాకు ట్రైనింగ్‌ ఇచ్చేందుకు ఒప్పుకొన్నారు. ఆ బ్యాచ్‌లో నలుగురం ఉండేవాళ్లం. అందులో ప్రభాస్‌ ఒకరు. అలా ప్రభాస్‌ నా క్లాస్‌మేట్‌ అయ్యారు. ‘రాఘవేంద్ర’ చిత్రం నుంచి ఆయనతోనే ఉన్నా. ఆ తర్వాత సినిమాల్లో అవకాశం వచ్చి, నటుడిగా మంచి పేరు వచ్చింది. ప్రభాస్‌ లేకపోతే ‘శ్రీను’ పేరుకు విలువ లేదు. ఆయనతో పరిచయం అయ్యాకే నా విలువ పెరిగింది’’ అని చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని