Prabhudeva: ‘గాలి నాగేశ్వరరావు’ కోసం..!

మంచు విష్ణు హీరోగా ఈషాన్‌ సూర్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘గాలి నాగేశ్వరరావు’. అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోనీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Updated : 05 May 2022 08:21 IST

మంచు విష్ణు హీరోగా ఈషాన్‌ సూర్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘గాలి నాగేశ్వరరావు’. అవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోనీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా విష్ణు, పాయల్‌పై ఓ పాట తెరకెక్కిస్తున్నారు. దీనికి ప్రభుదేవా నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. మంచు విష్ణు, ప్రభుదేవా కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో రేణుకగా సన్నీలియోనీ కనిపించనుండగా.. స్వాతి పాత్రను పాయల్‌ పోషిస్తోంది. కోన వెంకట్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు. ఛాయాగ్రహణం: చోటా.కె.నాయుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని