మీ వల్లే నా కల సాకారమైంది : ప్రదీప్‌

వ్యాఖ్యాతగా గత కొన్నిసంవత్సరాలుగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ప్రదీప్‌.. తాజాగా కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆయన ప్రధాన పాత్రలో నటించిన...

Updated : 30 Jan 2021 14:05 IST

అభిమానులకు నటుడు లేఖ

హైదరాబాద్‌: వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ప్రదీప్‌.. తాజాగా కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ జనవరి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి ప్రదీప్‌ ఫిదా అయ్యారు. తమ చిత్రానికి మంచి రెస్పాన్స్‌ వచ్చేలా చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతూ ట్విటర్‌ వేదికగా ఓ లేఖను పంచుకున్నారు.

‘ఒక చిన్న చిత్రానికి విశేష స్పందన వచ్చింది. ఎన్నో రోజుల కల ఇది. మీ అందరి సహకారంతోనే ఈరోజు సాధ్యమైంది. నా కెరీర్‌లో అతి పెద్ద అడుగు వేసేటప్పుడు ఇంత మంది అండ నాకు ఉండడం, అద్భుతమైన ఓపెనింగ్స్‌ లభించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఎప్పటికీ మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉంటాను’ అని ఆయన అన్నారు.

మున్నా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రదీప్‌కు జంటగా అమృతా అయ్యర్‌ నటించారు. హేమ, పోసాని కృష్ణ మురళి, శుభలేఖ సుధాకర్‌, శివన్నారాయణ కీలకపాత్రలు పోషించారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందించిన ఈ సినిమాలోని ‘నీలినీలి ఆకాశం’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఇదీ చదవండి

రివ్యూ: 30 రోజుల్లో ప్రేమిచడం ఎలా?

అందరూ వచ్చారు కానీ వీళ్లే ఆగిపోయారు

దయచేసి.. మా ఇంటికి రావొద్దు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని