Rajneeti2: రాజ్‌నీతి-2 స్క్రిప్ట్‌ సిద్ధం

పన్నెండేళ్ల కిందట సంచలన విజయం సాధించిన సినిమా రాజ్‌నీతి. కత్రినా కైఫ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అజయ్‌ దేవగణ్‌, నానా పటేకర్‌, మనోజ్‌ బాజ్‌పేయిలాంటి భారీ తారాగాణంతో తెరకెక్కింది. వాణిజ్యపరంగా విజయం సాధించడమే కాదు..

Updated : 25 May 2022 06:51 IST

న్నెండేళ్ల కిందట సంచలన విజయం సాధించిన సినిమా రాజ్‌నీతి. కత్రినా కైఫ్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అజయ్‌ దేవగణ్‌, నానా పటేకర్‌, మనోజ్‌ బాజ్‌పేయిలాంటి భారీ తారాగాణంతో తెరకెక్కింది. వాణిజ్యపరంగా విజయం సాధించడమే కాదు.. పలు అవార్డులు సైతం గెల్చుకుంది. పన్నెండేళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌ తీసుకురానున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్‌ కూడా సిద్ధమైనట్టు దర్శకుడు ప్రకాష్‌ ఝా ప్రముఖ బాలీవుడ్‌ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సీక్వెల్‌ ఎవరి కాంబినేషన్‌లో రూపొందుతుందో అని బాలీవుడ్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనిపై దర్శకుడు ఝా స్పందిస్తూ ‘రాజ్‌నీతి రెండో భాగం స్క్రిప్ట్‌ మొత్తం పూర్తి చేశాను. నేనెప్పుడూ కొత్త సబ్జెక్టులు రాయడానికి, తీయడానికి ప్రయత్నిస్తుంటా. కానీ అప్పటితో పోల్చుకుంటే దేశ రాజకీయాలో భారీ మార్పులొచ్చాయి. అది అలాగే ముందుకు తీసుకెళ్తానా? మార్పులు చేయాలా అన్నది ఇప్పుడే చెప్పలేం’ అంటూ తన అభిప్రాయం పంచుకున్నారు. సమకాలీన అంశాలనే కథాంశాలుగా ఎంచుకొని గంగాజల్‌, అపహరణ్‌, రాజ్‌నీతి, మృత్యుదండ్‌లాంటి సినిమాలు తీసి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఝా ప్రస్తుతం తెరకెక్కించిన ‘ఆశ్రమ్‌’ వెబ్‌సిరీస్‌ అత్యంత విజయవంతమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని