MAA Election: ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ ఇదే

అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ సభ్యుల వివరాలను ప్రకటించారు. మొత్తం 27మందితో ఈ జాబితాను విడుదల చేశారు.

Updated : 24 Jun 2021 16:31 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల రూపంలో తెలుగు సినీ పరిశ్రమలో మరో రసవత్తర పోరు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధ్యక్ష పోటీలో బరిలోకి దిగుతున్నట్లు నటుడు ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్‌, హేమ ప్రకటించారు. దీంతో ‘మా’లో చతుర్ముఖ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ సభ్యుల వివరాలను ప్రకటించారు. మొత్తం 27మందితో ఈ జాబితాను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ.. ‘‘త్వరలో జ‌ర‌గ‌బోయే ఎన్నికలను పురస్కరించుకుని ‘మా’ శ్రేయ‌స్సు దృష్ట్యా.. నిర్మాణాత్మక ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టే దిశ‌గా మా ప్రతిష్ట కోసం.. మ‌న న‌టీ నటుల బాగోగుల కోసం.. ‘మా’ టీంతో రాబోతున్న విష‌యాన్ని తెలియ‌ప‌రుస్తున్నా’’ అని పేర్కొన్నారు. ప‌ద‌వులు కాదు ప‌నులు మాత్రమే చేయ‌డం కోసం ఈ ఎన్నికల్లో బరిలో దిగుతున్నా అని తెలిపారు.

1.ప్రకాశ్‌రాజ్‌;  2.జ‌య‌సుధ‌; 3.శ్రీకాంత్‌; 4.బెన‌ర్జీ;  5.సాయికుమార్‌;  6.తనీష్‌; 7.ప్రగతి; 8. అన‌సూయ‌;  9.స‌న; 10.అనిత చౌద‌రి; 11.సుధ‌; 12.అజ‌య్‌;  13.నాగినీడు; 14.బ్రహ్మాజీ; 15.ర‌విప్రకాష్‌;  16.స‌మీర్‌; 17.ఉత్తేజ్; 18.బండ్ల గణేష్; 19.ఏడిద శ్రీరామ్‌; 20.శివారెడ్డి; 21.భూపాల్‌; 22.టార్జాన్‌; 23.సురేష్ కొండేటి;  24.ఖ‌య్యుం;  25.సుడిగాలి సుధీర్;  26.గోవింద‌రావు; 27. శ్రీధ‌ర్‌రావు.. ఈ ప్యానల్‌లో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని