Prakash Raj: ‘కశ్మీర్‌ ఫైల్స్‌’పై ప్రకాశ్‌రాజ్‌ తీవ్ర వ్యాఖ్యలు

కశ్మీర్‌ పండిట్‌లపై జరిగిన దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ (The Kashmir Files) సినిమాపై తీవ్ర విమర్శలు చేశారు నటుడు ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj).

Updated : 09 Feb 2023 11:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి (Vivek Agnihotri) తెరకెక్కించిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ (The Kashmir Files) చెత్త సినిమా అంటూ నటుడు ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) తీవ్ర విమర్శలు చేశారు. ఆ చిత్ర దర్శకుడికి భాస్కర్‌ అవార్డు కూడా రాదని విమర్శించారు. ఇటీవల కేరళలో నిర్వహించిన ‘మాతృభూమి ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ లేటర్స్‌ ఇన్‌ కేరళ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..

‘‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ (The Kashmir Files) ఒక చెత్త సినిమా. దాన్ని ఎవరు నిర్మించారో మాకు తెలుసు. సిగ్గులేనితనం. ఇంటర్నేషనల్‌ జ్యూరీ కూడా ఈ చిత్రాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఇంత జరిగినా వాళ్లకు ఇంకా సిగ్గురాలేదు. ఆ చిత్ర దర్శకుడు ఇప్పటికీ.. ‘‘నాకు ఎందుకు ఆస్కార్ రాలేదు‌?’’ అని మాట్లాడుతున్నాడు. అతడికి ఆస్కార్‌ కాదు కదా..  భాస్కర్‌ కూడా రాదు. ఇలాంటి ప్రచార చిత్రాలు తీయడానికి కొంతమంది రూ.2000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని నాకు తెలిసిన వాళ్లు చెప్పారు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే కార్యక్రమంలో ఆయన ‘బాయ్‌కాట్‌ పఠాన్‌’ (Pathaan) అంశంపైనా మాట్లాడారు. ‘మొరిగే కుక్కలు కరవవు’ అనే సామెత వాళ్లకు సరిపోతుందని అన్నారు.

కశ్మీర్‌ పండిట్స్‌పై జరిగిన ఆకృత్యాల నేపథ్యంలో వివేక్‌ అగ్నిహోత్రి ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా అంతటా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. అనుపమ్‌ ఖేర్‌, దర్శన్‌ కుమార్‌, మిథున్‌ చక్రవర్తి, పల్లవి జోషీ తదితరులు కీలక పాత్ర పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని