Maa Elections: చిరంజీవితో ప్రకాశ్‌రాజ్ కీలక భేటీ!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అగ్రకథానాయకుడు చిరంజీవి ఎంతో కృషి చేస్తున్నారని
హైదరాబాద్: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అగ్రకథానాయకుడు చిరంజీవి ఎంతో కృషి చేస్తున్నారని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. ఈ విషయంలో చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని కొనియాడారు. అలాంటి సోదరుడు దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. మంగళవారం ఫిల్మ్ నగర్ అపోలో ఆస్పత్రి జిమ్‌లో చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశమైన ప్రకాశ్ రాజ్.... చిత్రపరిశ్రమలో ఇటీవల నెలకొన్న పరిణామాలపై కాసేపు చర్చించారు. మరోవైపు నటీనటుల సంఘం అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న ప్రకాశ్‌రాజ్‌కు మెగా కుటుంబం మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఇరువురి జిమ్ భేటీ చిత్ర పరిశ్రమలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేస్తూ ‘జెండా ఎగరేస్తాం’ అంటూ మా ఎన్నికల్లో తమ ప్యానెల్ విజయం సాధిస్తుందని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు