Andhra News: ఏపీలో థియేటర్‌ యజమానులను బెదిరిస్తున్నారు: తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌

సినిమా థియేటర్‌ యజమానులను బెదిరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ ఉద్యోగులు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆరోపించింది. రేపు విడుదల కానున్న

Updated : 24 Feb 2022 17:39 IST

హైదరాబాద్‌: సినిమా థియేటర్‌ యజమానులను బెదిరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ ఉద్యోగులు కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆరోపించింది. ‘భీమ్లానాయక్‌’ విడుదల కానున్న నేపథ్యంలో రద్దైన జీవో 35 ప్రకారం టికెట్లు విక్రయించాలని ఎగ్జిబిటర్లపై ఒత్తిడి తేవడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఫిల్మ్‌ ఛాంబర్‌ గౌరవ కార్యదర్శి ప్రసన్నకుమార్‌, నిర్మాత నట్టి కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రద్దైన జీవో ప్రకారం టికెట్‌ ధరలను ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో పలువురు రాజకీయ నాయకులు కావాలనే ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. వెంటనే ముఖ్యమంత్రి జగన్‌ జోక్యం చేసుకుని రద్దైన జీవో 35 కంటే ముందున్న జీవో 100 ప్రకారమే టికెట్‌ ధరలు ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నటీనటులకు వివిధ రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నా.. సినిమా వరకు వచ్చే సరికి సినిమానే ప్రాధాన్యత ఉంటుందని ప్రసన్నకుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని