స్నేహ వ్యాక్సిన్‌ డ్రామా.. ఫన్నీ వీడియో

వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఇంజక్షన్‌ వేయించుకోవడం అంటే చాలా భయపడిపోతారు. సాధారణ సమయాల్లో ఎంతో ధైర్యం ప్రదర్శించే వాళ్లు కూడా సూది అనగానే వణికిపోతుంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్లను చూస్తుంటే పక్కన ఉన్న వాళ్లకు నవ్వు ఆపుకోవడం కాస్త కష్టమే.

Published : 19 Jul 2021 01:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంజక్షన్‌ వేయించుకోవడం అంటే చాలామంది భయపడిపోతారు. సాధారణ సమయాల్లో ఎంతో ధైర్యం ప్రదర్శించే వాళ్లు కూడా సూది అనగానే వణికిపోతుంటారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్లను చూస్తుంటే పక్కన ఉన్నవాళ్లకు నవ్వు ఆపుకోవడం కాస్త కష్టమే. నటి స్నేహ విషయంలోనూ ఇదే జరిగింది.

కొవిడ్‌ టీకా వేసే క్రమంలో డాక్టర్‌ ఆమె దగ్గరకు రావడం.. స్నేహ దూరం జరగడం.. చివరికి రెండో ప్రయత్నంలో డాక్టర్‌ ఆమెకు టీకా వేయగలిగింది. మొత్తానికి ఆపసోపాలు పడి మొదటి డోస్‌ టీకా అయితే వేయించుకుంది. హమ్మయ్య ఇక రెండో డోస్‌ ఒకటి మిగిలి ఉంది అని ఊపిరి పీల్చుకుంది. ఈ తతంగాన్ని మొత్తం తన భర్త ప్రసన్న వీడియో తీశాడు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘జాబ్‌ డ్రామా’ అంటూ ఫన్నీ ఆ పోస్టులో రాసుకొచ్చాడు. ‘తొలి వలపు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్నేహ.. ‘సంక్రాంతి’, ‘శ్రీ రామదాసు’ వంటి పలు హిట్‌ సినిమాల్లో నటించింది. 2012లో సహ నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని