Prabhas: ‘సలార్‌’కు కొత్త తలనొప్పులు.. ప్రశాంత్‌ నీల్‌ కఠిన నిర్ణయం

ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’.

Published : 26 Sep 2022 16:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’. శ్రుతి హాసన్‌ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ‘సలార్‌’కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్‌ నటించిన సన్నివేశానికి సంబంధించిన ఫొటోలు కావడంతో బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. ఈ విషయం దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దృష్టికి వెళ్లడంతో లీక్‌లపై ఆయన మండిపడ్డారట. ఎంతో కష్టపడి సన్నివేశాలను తెరకెక్కిస్తుంటే ఇలా ఆన్‌లైన్‌లో లీక్‌ అవడంపై చిత్ర బృందానికి క్లాస్‌ తీసుకున్నారట. అంతేకాదు, మరో కఠిన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక నుంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరూ సెట్‌లోకి మొబైల్ ఫోన్‌ తీసుకురావద్దని ఆదేశించారట. ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌ను కారావ్యాన్‌ లేదా లాకర్స్‌లో పెట్టుకుని రావాల్సిందిగా సూచించారట. గతంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయంలోనూ ఇలాగే జరగడంతో జక్కన్న కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు ‘సలార్‌’లో కథానాయికగా నటిస్తున్న శ్రుతిహాసన్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌పై ప్రశంసలు కురిపించారు. సినిమా నటులతో ఆయన వ్యవహరించే తీరు చాలా బాగుంటుందని చెప్పుకొచ్చింది. ‘సెట్‌లో ఉన్న నటీనటులతో ప్రశాంత్‌ చాలా బాగా ఉంటారు. అంతేకాదు, ఆయనతో పనిచేయడం కూడా సులువుగా ఉంటుంది. ప్రతి సన్నివేశంపై ఆయనకు చక్కని విజన్‌ ఉంది. ప్రతి సినిమాకు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఆ ప్రపంచంలో నటీనటులైన మా పని కలిసిపోయి ఉంటోంది. ప్రశాంత్‌ తెరకెక్కించేవి యాక్షన్‌ డ్రామా చిత్రాలైనా భావోద్వేగాలు కూడా ఉంటాయి’’ అని శ్రుతిహాసన్‌ తెలిపింది. ఇక సలార్‌లో పృథ్వీరాజ్‌ సుకుమార్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరు 28న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని