Updated : 15 Jul 2022 10:56 IST

Pratap Pothen: సీనియర్‌ నటుడు ప్రతాప్‌ పోతన్‌ కన్నుమూత

చెన్నై: సీనియర్‌ నటుడు ప్రతాప్‌ పోతన్‌(70) (Pratap Pothen) కన్నుమూశారు. గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆయన మరణవార్త తెలుసుకుని సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

వ్యాపార కుటుంబంలో పుట్టిన ప్రతాప్‌కు చిన్నతనం నుంచి సినీ పరిశ్రమపై ఆసక్తి ఎక్కువ. ‘ఆరవం’ అనే మలయాళీ సినిమాతో ఆయన నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు . తెలుగు, తమిళం, మలయాళంలో వందకుపైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించారు. ‘ఆకలిరాజ్యం’, ‘కాంచన గంగ’, ‘జస్టిస్‌ చక్రవర్తి’, ‘చుక్కల్లో చంద్రుడు’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ చిత్రాల్లో ఆయన సహాయనటుడిగా నటించి తెలుగువారికీ చేరువయ్యారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ ఆయన పలు సినిమాలు తెరకెక్కించారు. ‘చైతన్య’ అనే తెలుగు చిత్రానికీ ఆయన దర్శకుడిగా పనిచేశారు. ఇక, వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1985లో నటి రాధికను ప్రతాప్‌ వివాహమాడారు. వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లైన ఏడాదిలోనే వీరిద్దరూ విడిపోయారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని