
Preity Zinta: నటి ప్రీతి జింటాకు కవలలు
లండన్: బాలీవుడ్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతిజింటా శుభవార్త చెప్పారు. సరోగసి విధానంలో కవల పిల్లలకు తల్లైనట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గురువారం ఉదయం ఇన్‌స్టా వేదికగా ఆమె ఓ పోస్ట్ చేశారు. ‘‘మీ అందరితో ఓ ఆనందకరమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. సరోగసి విధానంలో కవల పిల్లల్ని పొందినందుకు నేను, నా భర్త జీన్ గూడెనఫ్ ఎంతో సంతోషిస్తున్నాం. జై, జియాలను మా జీవితాల్లోకి ఆహ్వానించడం మాకెంతో ఆనందంగా ఉంది. తల్లిదండ్రులుగా జీవితంలో కొత్త ప్రయాణం మొదలైంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఎల్లప్పుడూ మాకు తోడుగా నిలిచిన వైద్యబృందానికి కృతజ్ఞతలు’’ అని ప్రీతి పేర్కొన్నారు. దీంతో ఆమె స్నేహితులు, సన్నిహితులతోపాటు పలువురు అభిమానులు సైతం నెట్టింట్లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘దిల్ సే’ చిత్రంతో ప్రీతి వెండితెరకు నటిగా పరిచయమయ్యారు. తెలుగులో విడుదలైన ‘ప్రేమంటే ఇదేరా’తో మొదటిసారి ఆమె కథానాయికగా వెండితెరపై మెరిశారు. ఆ సినిమా విజయం సాధించడంతోపాటు ఆమెకు ఎంతోమంది అభిమానుల్ని తీసుకొచ్చింది. అనంతరం ఆమె వరుస బాలీవుడ్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఈ క్రమంలోనే 2016లో అమెరికాకు చెందిన జీన్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకుని లాస్‌ఏంజెల్స్‌లో సెటిల్ అయ్యారు.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.