Prince: ఓటీటీలోకి ‘ప్రిన్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

శివకార్తికేయన్‌ ‘ప్రిన్స్‌’ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఏ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందంటే..?

Published : 15 Nov 2022 01:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శివకార్తికేయన్‌ (Sivakarthikeyan) హీరోగా దర్శకుడు అనుదీప్‌ కె.వి. తెరకెక్కించిన ఎంటర్‌టైనర్‌ ‘ప్రిన్స్‌’. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాతో ఉక్రెయిన్‌ నటి మరియా ర్యాబోషప్క టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

కథేంటంటే?: ఆనంద్‌ (శివకార్తికేయన్‌) ఓ స్కూలు టీచర్‌. క్లాసులు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లేంత స్ట్రిక్ట్‌ టీచర్‌. అలాంటి కుర్రాడు స్కూల్లో ఇంగ్లిష్‌ టీచర్‌గా చేరిన జెస్సికా (మరియా) అనే బ్రిటిష్‌ అమ్మాయిని చూసి మనసు పారేసుకుంటాడు. వీరి ప్రేమను జెస్సికా తండ్రి అంగీకరించడు. దీంతో ప్రేమ పెళ్లిళ్లకు బాగా సపోర్టు చేసే తన తండ్రి విశ్వనాథ్‌ (సత్యరాజ్‌) దగ్గరకు వెళ్తాడు. అయితే, అతను మాత్రం షాక్‌ ఇస్తాడు. అప్పటివరకు లవ్‌గురులా మాటలు చెప్పిన విశ్వనాథ్‌ ఒక్కసారి వ్యతిరేకం అయిపోతాడు. అప్పటివరకు ప్రేమ పోరాటంలా కనిపించిన ఈ కథ రెండు దేశాల మధ్య పోరులా మారిపోతుంది. దీంతో ఆనంద్‌ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే అసలు కథ.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts