Prince: భారత్‌ అబ్బాయి- బ్రిటిష్‌ అమ్మాయి లవ్‌స్టోరీ.. ఆసక్తిగా ‘ప్రిన్స్‌’ ట్రైలర్‌

శివ కార్తికేయన్‌, మరియా ర్యాబోషప్క జంటగా నటించిన చిత్రం ‘ప్రిన్స్‌’. అనుదీప్‌ కె.వి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ ఆదివారం విడుదలైంది.

Published : 10 Oct 2022 01:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌ అబ్బాయి.. బ్రిటిష్‌ అమ్మాయిని ప్రేమించి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? వారిద్దరూ ఒక్కటయ్యారా, లేదా? అనే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ప్రిన్స్‌’ (Prince). శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan), మరియా ర్యాబోషప్క హీరోహీరోయిన్లు. అనుదీప్‌ కె. వి (Anudeep KV) దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటుడు విజయ్‌ దేవరకొండ సోషల్‌ మీడియా వేదికగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘కులం, మతం కోసం ఇంకా కొట్టుకుంటున్నారేంట్రా’ అని సత్యరాజ్‌ చెప్పే సంభాషణతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆసక్తిగా సాగింది. టీచర్‌గా శివ కార్తికేయన్‌ కనిపించిన తీరు, కథానాయిక అందం, అభినయం ఆకట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడు అనుదీప్‌ తనదైన కామెడీ మార్క్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించబోతున్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని