Published : 23 Mar 2021 01:14 IST

‘టైగర్ 3’కి సంగీత దర్శకుడిగా ప్రీతమ్‌!

ఇంటర్నెట్‌ డెస్క్: కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ - కత్రీనా కైఫ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ 3’. గతంలో వచ్చిన ‘టైగర్‌’ చిత్రాలకు ఈ చిత్రం సీక్వెల్‌గా రూపొందుతోంది. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్ సంస్థ నిర్మాణంలో వస్తోన్న చిత్రానికి సంగీత దర్శకుడిగా ప్రీతమ్‌ను తీసుకున్నారు. గతంలో ప్రీతమ్‌ సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘బజరంగీ భాయిజాన్‌’, ‘రెడీ’ వంటి సినిమాలకు సంగీత స్వరాలు సమకూర్చారు. ‘టైగర్‌ 3’ పాటలను భారీ స్థాయిలో చిత్రీకరించాలని నిర్మాణ సంస్థ యోచిస్తోందని సమాచారం. ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారట. చిత్రంలో ప్రతినాయకుడిగా ఇమ్రాన్‌ హష్మీ నటించనున్నారు. ముంబయిలో ఈనెల 8న సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో నెలరోజుల పాటు ముంబైలో షూటింగ్‌ పూర్తి చేసుకుని తర్వాత జూన్‌లో యూరప్‌ షూటింగ్‌కి వెళ్లనున్నారు. ‘టైగర్ 3’ని 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. తొలుత ‘టైగర్‌’ చిత్రానికి కబీర్ ఖాన్, ‘టైగర్‌ 2’కి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సల్మాన్‌ ఖాన్‌ - అమీర్‌ ఖాన్‌  ‘లాల్‌ సింగ్‌ చద్దా’, షారుఖ్‌ల ‘పఠాన్‌’ చిత్రాల్లో  అతిధిగా కనిపించనున్నారు. ఇక కత్రీనా కైఫ్‌ - గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫోన్‌ బూత్‌’ చిత్రంలో నటిస్తోంది. 

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts