Salaar: ‘సలార్’లో మన్నార్..
ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘సలార్’లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ పుట్టినరోజుని పురస్కరించుకుని ‘సలార్’లోని ఆయన లుక్‌ని ఆదివారం విడుదల చేశారు.
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘సలార్’లో (Salaar) మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ పుట్టినరోజుని పురస్కరించుకుని ‘సలార్’లోని ఆయన లుక్‌ని ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పాత్రకి సంబంధించిన పలు విషయాల్ని వెల్లడించాయి సినీవర్గాలు. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ... హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న చిత్రమిది. ప్రభాస్‌కి జోడీగా శ్రుతిహాసన్ నటిస్తున్నారు. వరదరాజ్ మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ‘‘ప్రభాస్ - పృథ్వీరాజ్ మధ్య గొప్ప డ్రామాని చూస్తాం. సినిమాలో ఇద్దరి పాత్రలు దీటుగా ఉంటాయి. వరదరాజ్ మన్నార్‌గా పృథ్వీరాజ్ కంటే మరెవ్వరూ గొప్పగా నటించలేరు. ఈ ఇద్దరితో కలిసి ప్రయాణం చేయడం ఓ గొప్ప అనుభవం’’ అన్నారు. ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబరు 28న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandra babu Arrest: ప్రజల ఫోన్లలో వాట్సాప్ డేటా తనిఖీ చేయడం దుర్మార్గమైన చర్య: లోకేశ్
-
Ravi Kishan : దానిశ్ అలీ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. చర్యలు తీసుకోండి : రవికిషన్
-
Nagababu: చంద్రబాబు అరెస్టుపై జనసైనికులు ఆవేదనతో ఉన్నారు: నాగబాబు
-
Khalistani ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. 19మంది ఆస్తుల జప్తునకు NIA సిద్ధం!
-
Rahul Gandhi: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే పైచేయి..! తెలంగాణలో భాజపాపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
-
Canada: నిజ్జర్ హత్యపై అమెరికా నుంచే కెనడాకు కీలక సమాచారం..!