Updated : 09 May 2022 13:31 IST

Prithviraj: ‘ధర్మం కోసమే జీవిస్తా.. ధర్మం కోసమే మరణిస్తా’

‘పృధ్వీరాజ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది

హైదరాబాద్‌: ‘‘మా ప్రాణాలైనా అర్పిస్తాం కానీ.. మా దేశం నుంచి పిడికెడంత మట్టి కూడా మీ సుల్తాన్‌కివ్వం’’ అని అంటున్నారు అక్షయ్‌ కుమార్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్‌ డ్రామా ‘పృధ్వీరాజ్‌’. చంద్రప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. మానుషి కథానాయిక. జూన్‌ 3న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా ‘పృధ్వీరాజ్‌’ ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘‘ఉత్తరాధికారిని బంధురీత్యా కాదు యోగ్యతతో ఎంచుకుంటారు. శౌర్యానికి, వీరత్వానికి ఇంకా న్యాయం కోసం.. పృధ్వీరాజ్‌ చౌహాన్‌కి దిల్లీ సింహాసనంపై పట్టాభిషేకం చేస్తున్నాం’’ అంటూ ట్రైలర్‌లో అక్షయ్‌ పాత్రని పరిచయం చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ఇందులో పృధ్వీరాజ్‌ గురువుగా చంద్‌ పాత్రలో సోనూసూద్‌ నటించారు. ‘వాల్మీకి వల్లే శ్రీరాముడు ఉన్నాడు. చంద్‌ వల్లే ఈ పృధ్వీరాజ్‌ చౌహాన్‌ ఉంటాడు’ అంటూ అక్షయ్‌ చెప్పే డైలాగ్‌ మెప్పించేలా ఉంది. ఇక, ట్రైలర్‌ చివర్లో.. ‘‘ధర్మం కోసమే జీవిస్తాను. ధర్మం కోసమే మరణిస్తాను’ అంటూ ఆయన చెప్పే డైలాగ్‌, సింహాలతో పోరాడిన తీరు, పోరాట సన్నివేశాలు.. సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని