అలరిస్తోన్న ప్రియదర్శి ‘మెయిల్’ టీజర్...

‘2005.. అప్పుడప్పుడే ఊర్లళ్లో కంప్యూటర్ పరిచయమవుతున్న రోజులు’ అంటూ టీజర్‌ ప్రారంభమవుతుంది. స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా ఉదయ్‌ గుర్రాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మెయిల్’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్వీకార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Updated : 25 Mar 2023 17:16 IST

హైదరాబాద్‌: ‘2005.. అప్పుడప్పుడే ఊర్లల్లో కంప్యూటర్ పరిచయమవుతున్న రోజులు’ అంటూ టీజర్‌ ప్రారంభమవుతుంది. స్వప్నదత్, ప్రియాంకదత్ నిర్మాతలుగా ఉదయ్‌ గుర్రాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మెయిల్’. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్వీకార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదల కానుంది. 

ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. అందులో ‘కంప్యూటర్ నేర్చుకోవాలంటే నేను చెప్పే మూడు షరతులను కచ్చితంగా పాటించాలి.. మొదటిది స్నానం చేసి రావాలి.. రెండవది చెప్పులు బయటనే విడిచి పెట్టాలి.. మూడవది నేను చెప్పిన సమయానికి రావాలి.. అంతేకాకుండా అంజి, రమేశ్ లాగా మరొక దుకాణం ప్రారంభిస్తా అంటే మంచిగా ఉండదు’ అనే మాటలు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. అసలు ఆ ఊరేంటి? ఆ ఊరిలో కంప్యూటర్‌ కథేంటి? కంప్యూటర్‌ వల్ల వారి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి? కంప్యూటర్‌ ఆ ఊరిని మార్చిందా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే మరి..!  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని