
Published : 23 Jan 2022 17:28 IST
BhamaKalapaam: చాలా డేంజరస్ హౌస్ వైఫ్.. ‘భామాకలాపం’ టీజర్..!
హైదరాబాద్: ‘మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచించవచ్చు.. కానీ, పక్కవాళ్ల గురించి తెలుసుకుంటే వచ్చే ఆనందమే వేరు’ అంటోది ప్రియమణి (Priyamani). ఆమె కీలక పాత్రలో అభిమన్యు తెరకెక్కించిన చిత్రం ‘భామా కలాపం’ (BhamaKalapaam). క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ‘ఆహా’లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రియమణి గృహిణిగా, పక్కింట్లో జరిగే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపే మహిళగా కనిపించారు. ప్రతివారం ఓ కొత్త వంటకం చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసే ఆమె, తొలిసారి ఓ స్పెషల్ వంటకాన్ని చేయాల్సి వస్తుంది. అది ఏంటి? ఎందుకు చేయాల్సి వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ఫిబ్రవరి 11న ‘భామాకలాపం’ ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.
Advertisement
Tags :