BhamaKalapaam: చాలా డేంజరస్‌ హౌస్‌ వైఫ్‌.. ‘భామాకలాపం’ టీజర్‌..!

‘మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచించవచ్చు.. కానీ, పక్కవాళ్ల గురించి తెలుసుకుంటే వచ్చే ఆనందమే వేరు’ అంటోది ప్రియమణి(Priyamani).

Published : 23 Jan 2022 17:28 IST

హైదరాబాద్‌: ‘మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచించవచ్చు.. కానీ, పక్కవాళ్ల గురించి తెలుసుకుంటే వచ్చే ఆనందమే వేరు’ అంటోది ప్రియమణి (Priyamani). ఆమె కీలక పాత్రలో అభిమన్యు తెరకెక్కించిన చిత్రం ‘భామా కలాపం’ (BhamaKalapaam). క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ‘ఆహా’లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రియమణి గృహిణిగా, పక్కింట్లో జరిగే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపే మహిళగా కనిపించారు. ప్రతివారం ఓ కొత్త వంటకం చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసే ఆమె, తొలిసారి ఓ స్పెషల్‌ వంటకాన్ని చేయాల్సి వస్తుంది. అది ఏంటి? ఎందుకు చేయాల్సి వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ఫిబ్రవరి 11న ‘భామాకలాపం’ ‘ఆహా’లో స్ట్రీమింగ్‌ కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని