Bhamakalapam: ఈ వంట ఎలా చేయాలో ప్రియమణికి కూడా తెలియదట

ఒకప్పుడు కథానాయికగా వరుస చిత్రాలతో అలరించిన నటి ప్రియమణి. వివాహం అనంతరం కూడా సినీ కెరీర్‌ను కొనసాగిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Published : 17 Jan 2022 01:34 IST

హైదరాబాద్‌: ఒకప్పుడు కథానాయికగా వరుస చిత్రాలతో అలరించిన నటి ప్రియమణి. వివాహం అనంతరం కూడా సినీ కెరీర్‌ను కొనసాగిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, వివిధ షోలకు న్యాయనిర్ణేతగా మెప్పిస్తున్నారు. తాజాగా అభిమన్యు దర్శకత్వంలో ఆమె నటించిన చిత్రం ‘భామా కలాపం’. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ ఒరిజినల్‌ ఫిల్మ్‌గా ఇది తెరకెక్కింది. దర్శకుడు భరత్‌ కమ్మ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. సంక్రాంతి సందర్భంగా ‘భామా కలాపం’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రియమణి యూట్యూబ్‌ వేదికగా వంటలు చేస్తూ వీడియోలు పంచుకునే అనుపమ అనే పాత్ర పోషిస్తున్నారు. ప్రతివారం ఒక కొత్త వంట చేసే ఆమె, తొలిసారి ఓ స్పెషల్‌ వంటకాన్ని చేయాల్సి వచ్చింది? అది ఏంటి? ఎందుకు చేయాల్సి వచ్చింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని