Priyamani: సమంత హాట్‌గా కనిపించింది: ప్రియమణి

‘ఫ్యామిలీ మేన్‌’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటి ప్రియమణి. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో మెప్పిస్తున్నారు. ....

Updated : 07 Dec 2022 16:08 IST

సామ్‌పై నటి వ్యాఖ్యలు

హైదరాబాద్‌: ‘ఫ్యామిలీ మేన్‌’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నటి ప్రియమణి. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో మెప్పిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘భామ కలాపం’ త్వరలో ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘సినీ పరిశ్రమలో ఇప్పుడు పరిస్థితులు మారాయి. దర్శక-నిర్మాతలు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. ప్రేక్షకులు సైతం వాటిని ఆహ్వానిస్తున్నారు. పాత కాలంలో.. కేవలం గ్లామర్‌, హీరోతో రొమాన్స్‌ చేయడానికి మాత్రమే హీరోయిన్ల పాత్రలు క్రియేట్‌ చేసేవాళ్లు. ఇప్పుడు చూసుకుంటే కమర్షియల్‌ చిత్రాల్లోనూ హీరోయిన్‌కి ఓ మంచి రోల్‌ ఇస్తున్నారు. అలాగే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఉదాహరణకు నయనతారను చూడండి ఆమె ఓ వైపు రజనీకాంత్, విజయ్ వంటి స్టార్‌హీరోలతో నటిస్తూనే.. మరోవైపు ‘నెత్రికన్‌’, ‘మాయ’ వంటి అద్భుతమైన కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతోనూ మెప్పించారు. సమంత అయితే మూస పద్ధతులకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఆమె అన్నిరకాల పాత్రల్లోనూ నటిస్తున్నారు. ఇటీవల ఆమె చేసిన ‘ఊ అంటావా’ సాంగ్‌ని దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆ సాంగ్‌లో ఆమె ఎంతో హాట్‌గా కనిపించారు. నా భర్త కూడా అదే మాట చెప్పారు. ఇలాంటి ఒక సాంగ్‌ని చేసినందుకు సామ్‌కి ముందు ధన్యవాదాలు చెప్పాలి’’ అని ప్రియమణి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని