Priyamani: ‘జవాన్‌ 2’లో విజయ్‌!.. ప్రియమణి ఏమన్నారంటే?

‘జవాన్‌’లో (Jawan) తన నటనతో ఆకట్టుకున్నారు నటి ప్రియమణి (Priyamani). తాజాగా సీక్వెల్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

Published : 22 Sep 2023 17:26 IST

ముంబయి: అట్లీ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించిన తాజా బ్లాక్‌ బస్టర్‌ ‘జవాన్‌’(Jawan). ఇందులో నటి ప్రియమణి (Priyamani) ఓ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రం విడుదల ముందు నుంచే వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్ హిట్‌ సాధించిన సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో సీక్వెల్‌ (Jawan 2) గురించి మాట్లాడారు. అందులో విజయ్‌ ఉండే అవకాశం ఉందా అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు.

‘‘జవాన్‌’ సినిమా ప్రకటన రాగానే అందులో కోలీవుడ్‌ హీరో విజయ్‌ ఉన్నారనే వార్త వైరల్‌గా మారింది. నేను ఆ వార్త నిజమనుకున్నాను. అట్లీ (Atlee) దగ్గరకు వెళ్లి విజయ్‌తో నాకు ఓ సన్నివేశాన్ని రాయండి అని అడిగాను. అవకాశం ఉంటే అతడి భార్య పాత్ర నాకు ఇవ్వండి అని చెప్పాను. దానికి అట్లీ కూడా సరే అన్నారు. ‘అలాంటి పాత్ర ఉండేలా ప్రయత్నిద్దాం’ అని అన్నారు. కానీ, వెంటనే నవ్వుతూ ఆ టాపిక్‌ను మార్చేశారు. ఆ నవ్వు వెనుక అర్థం ఎవరికీ తెలీదు’’ అని అన్నారు. ఇక ‘జవాన్‌ 2’ గురించి చెబుతూ..‘ఒకవేళ దీని సీక్వెల్ వస్తే అందులో విజయ్‌ ఉన్నారో.. లేదో అధికారికంగా చెప్పే వరకు తెలియదు’ అని ప్రియమణి వివరించారు. 

నా సాయం పొందిన వ్యక్తే నన్ను తిట్టాడు: ‘బేబీ’ దర్శకుడు

అలాగే ‘జవాన్‌’లో తన పాత్ర గురించి మాట్లాడిన ప్రియమణి..‘‘కొవిడ్ సమయంలో అట్లీ జూమ్‌ మీటింగ్‌లో నాకు ఈ కథను వివరించారు. నాకు చాలా నచ్చింది. కొత్తగా ఉందని.. చేస్తానని చెప్పాను. ఈ తరహా పాత్రలు దక్షిణాదిలో నేను ఇప్పటి వరకూ చేయలేదు. ఇక షారుక్‌ నటన చూస్తూ పెరిగాను. ఆయనతో నటించడం ఓ సవాలుగా అనిపించింది. నా పాత్రకు నేను వంద శాతం న్యాయం చేయాలని భావించాను. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుందని అనుకోలేదు. ఇంత గొప్ప సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు