Priyamani:అలా మాట్లాడితే.. బాలీవుడ్‌లో అవకాశాలు పరిమితంగా వస్తాయి

‘ఫ్యామిలీమ్యాన్‌-2’ వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసు దోచింది నటి ప్రియమణి. దక్షిణాదిన సత్తా చాటినామె.. ఇప్పటి వరకూ హిందీలో పలు చిత్రాల్లో నటించారు. తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో సత్తాచాటిన దక్షిణాది కథానాయికలను ఏవిధంగా చూసేవారనే అంశంపై మాట్లాడారు.

Published : 30 Jan 2022 01:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఫ్యామిలీమ్యాన్‌’ వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసు దోచింది నటి ప్రియమణి. దక్షిణాదిన సత్తా చాటినామె.. ఇప్పటి వరకూ పలు హిందీ చిత్రాల్లో నటించారు. తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో సత్తాచాటిన దక్షిణాది కథానాయికలను ఏవిధంగా చూసేవారనే అంశంపై మాట్లాడారు.

‘‘బాలీవుడ్‌ చిత్రాల్లో కేరళ, చెన్నై నుంచి వచ్చిన హీరోయిన్స్‌ మాట్లాడే హిందీని ఒక యునిక్‌ యాక్సెంట్‌లో చూపించారు. ఒక తరం దక్షిణాది తారలు.. శ్రీదేవి, రేఖ, హేమామాలిని, వైజయంతి మాల బాలీవుడ్‌ని ఏలారు. ఆ హవా ఆ తరంతోనే ఆగిపోయింది. హిందీని (క్యాజీ, క్యా బోల్తే జీ) సాధారణంగా మాట్లాడేస్తే.. దక్షిణాది భామలకి బాలీవుడ్‌లో అవకాశాలు పరిమితంగానే వస్తాయి. అయితే బాలీవుడ్‌లో ఇప్పుడా ధోరణి మారుతోంది. మారుతున్న ట్రెండ్స్‌కి అనుగుణంగా బాలీవుడ్‌ సైతం దక్షిణాది టెక్నిషియన్స్‌కి తీసుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు హిందీ చిత్ర సీమలో పనిచేసే వారిలో దక్షిణాది మంది ఎక్కువగానే కనిపిస్తున్నారు. వెంటనే గుర్తింపు తెచ్చుకుంటున్నారు. బాలీవుడ్‌ ప్రేక్షకుల అభిరుచుల్లో క్రమేనా మార్పు వస్తోంది. ఇప్పుడు వారంతా సౌత్‌ సినిమా అంటే క్రేజ్‌ చూపిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్‌లో దక్షిణాది వారికి  గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది’’ అని ప్రియమణి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం భారత ప్రముఖ ఫుట్‌బాల్‌ ఆటగాడు సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ బయోగ్రాఫికల్‌ స్పోర్ట్స్‌ చిత్రం ‘మైదాన్‌’లో నటిస్తున్నారు ప్రియమణి. ఇందులో హీరో అజయ్‌ దేవగణ్‌కు భార్యగా కనిపించనున్నారు. వీటితో పాటు ఆమె నటించిన రానా-సాయిపల్లవి ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు