Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ
తాను ఎందుకు బాలీవుడ్‌కు దూరంగా ఉంటున్నారో పాడ్‌కాస్ట్ ద్వారా తెలిపారు ప్రముఖ నటి ప్రియాంక చోప్రా. హిందీ చలన చిత్ర పరిశ్రమ గురించి ఆమె ఏం మాట్లాడారంటే?
ఇంటర్నెట్ డెస్క్: హిందీ చిత్ర పరిశ్రమపై ప్రముఖ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ (Bollywood)లోని రాజకీయాలకు విసిగిపోయానని, అందుకే హాలీవుడ్ (Hollywood)లో స్థిరపడ్డానని తెలిపారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆ వివరాలు పంచుకున్నారు. ‘‘హిందీ చలన చిత్ర పరిశ్రమలో నన్ను ఓ మూలకు తోసేశారు. ఎవరూ నాకు అవకాశాలు ఇచ్చేవారు కాదు. పలువురితో విభేదం ఏర్పడింది. అక్కడ రాజకీయాలు ఉంటాయి. వాటితో నేను విసిగిపోయా. అందుకే బాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకోవాలనిపించింది. అలా అమెరికా వచ్చేశా’’ అని ఆమె ఎదుర్కొన్న పరిస్థితి గురించి చెప్పారు. ‘దేశీ హిట్స్’కు చెందిన అంజులా ఆచార్య తన మ్యూజిక్ వీడియోను మెచ్చి, హాలీవుడ్‌లో పనిచేసే అవకాశం కల్పించారని తెలిపారు. అంజులా ప్రస్తుతం ప్రియాంకు మేనేజరుగా వ్యవహరిస్తున్నారు.
ఎన్నో సూపర్‌హిట్ హిందీ చిత్రాలో మెరిసిన ప్రియాంక ‘క్వాంటికో’ అనే టెలివిజన్ సిరీస్‌తో హాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ‘బేవాచ్’, ‘ఏ కిడ్ లైక్ జాక్’, ‘వుయ్ కెన్ బీ హీరోస్’, ‘ది వైట్ టైగర్’ తదితర చిత్రాల్లో నటించారు. పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించి మెప్పించారు. హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇంటికి దీపం ‘స్వర్ణభారత్’.. దత్తత తీసుకున్న అమ్మాయికి వివాహం జరిపించిన మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె
-
Rain Alert: నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
-
CM Jagan: కరకట్ట రోడ్డు కనిపిస్తోందా సారూ..!
-
Asian Games: అన్న అక్కడ.. తమ్ముడు ఇక్కడ
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్