Priyanka Chopra: ప్రియాంక చోప్రా తన మొదటి సంపాదనతో ఏం కొన్నదో తెలుసా..!

స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. ఆమె మొదటి సంపాదనతో ఏం కొన్నదో చెప్పింది.

Published : 08 Jun 2023 18:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2000వ సంవత్సరంలో మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుని స్టార్‌ హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. అగ్ర హీరోలందరి సరసన నటించి అన్నీ భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది. తన మొదటి సంపాదనతో ఏం కొనుగోలు చేసిందో వెల్లడించింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక తన మొదటి పారితోషికంతో తనకు నచ్చిన వస్తువులు కొన్నట్లు వెల్లడించింది. ‘‘నా తొలి సంపాదనగా నేను ఎక్కువ అమౌంట్‌నే అందుకున్నాను. దానితో మొదటిసారి కారు కొన్నాను. ఒక ఖరీదైన ఉంగరం కొన్నాను. నా మొదటి పారితోషికంతో నాకు నచ్చిన పనులు చేశాను. ఈ విషయంలో ఇప్పటికీ గర్వపడుతుంటాను. ఇక నా తల్లిదండ్రులు కూడా నన్నెప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. వారి కోసం నా సంపాదనను ఖర్చు చేయడంలోనూ నాకు ఆనందం ఉంది’’ అని తెలిపింది. ఇక బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా అలరించిన ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇప్పుడు హాలీవుడ్‌లోనూ తన సత్తా చూపుతోంది. ‘సిటాడెల్‌’ (Citadel) సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. అందాలతో ఆకట్టుకోవడంతో పాటు యాక్షన్‌ సన్నివేశాలోనూ ఆదరగొట్టగలదని నిరూపించింది. ప్రస్తుతం హాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్ట్‌లు అందిపుచ్చుకుంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని