Priyanka Chopra: ప్రియాంక కారణంగా షూట్‌ వాయిదా.. 20 ఏళ్ల తర్వాత వెల్లడించిన బీటౌన్‌ నిర్మాత

ప్రియాంక (Priyanka Chopra) హీరోయిన్‌గా బాలీవుడ్‌కు పరిచయమైన చిత్రం ‘అందాజ్‌’ (Andaaz). 2003లో విడుదలైన ఈసినిమా గురించి తాజాగా నిర్మాత సునీల్‌ స్పందించారు. ప్రియాంక కారణంగా ఈచిత్రాన్ని నెలన్నర వాయిదా వేసినట్లు చెప్పారు.

Updated : 29 May 2023 17:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి ప్రియాంకా చోప్రా(Priyanka Choprta)ని ఉద్దేశిస్తూ బీటౌన్‌ నిర్మాత సునీల్‌ దర్శన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె హీరోయిన్‌గా తాను నిర్మించిన ‘అందాజ్‌’ (Andaaz) గురించి సుమారు 20 ఏళ్ల తర్వాత ఆయన మాట్లాడారు.

‘‘ప్రియాంక నటిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం ‘అందాజ్‌’. ఆ సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడ్డారు. బాలీవుడ్‌ స్టైల్‌లో డ్యాన్స్‌ చేయడం కోసం ఆమె శ్రమించారు. ముఖ్యంగా, ‘Allah Kare Dil Na Lage’ సాంగ్‌ షూట్‌ కోసం చిత్రబృందం మొత్తం సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌కు వెళ్లాం. దర్శకుడి అంచనాలను ప్రియాంక అందుకోలేకపోయారు. అనుకున్న విధంగా ఆమె డ్యాన్స్‌ చేయలేకపోయారు. దాంతో షూట్‌ ఆగిపోయింది. మరోవైపు, అదే సమయంలో అక్షయ్‌కుమార్‌ సతీమణి డెలివరీ డేట్‌ దగ్గరపడింది. దీంతో ఆయన నా వద్దకు వచ్చి.. ‘షూట్‌ ఒక నెల రోజులు వాయిదా వేద్దాం. ఇప్పుడైతే ముంబయి వెళ్లిపోదాం’ అని సలహా ఇచ్చారు. దాంతో మేమంతా కేప్‌టౌన్‌ నుంచి ముంబయికి వచ్చేశాం. ప్రియాంకకు డ్యాన్స్‌ ట్రైనింగ్‌ క్లాసులు పెట్టించాం. అలా, 45 రోజులపాటు షూట్‌ వాయిదా వేశాం. ఆ తర్వాత అంతా సవ్యంగానే జరిగింది’’ అని సునీల్‌ వివరించారు. రాజ్ కన్వర్ దర్శకత్వం వహించిన ఈసినిమాలో అక్షయ్‌కుమార్‌, లారాదత్తా, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు