Priyanka Chopra: ‘ప్రియాంక అందగత్తె కాదు.. రిగ్గింగ్‌ చేసి గెలిచింది..!’: మాజీ సుందరి ఆరోపణ

2000 ప్రపంచ సుందరి పోటీల్లో రిగ్గింగ్ జరిగిందని, అందుకే ఆ ఏడాది పోటీల్లో ప్రియాంక గెలుపొందిందని మాజీ మిస్‌ బార్బడోస్‌ లెయ్‌లానీ మెకనీ ఆరోపణలు చేశారు.

Updated : 04 Nov 2022 11:14 IST

ముంబయి: గ్లోబల్‌ స్టార్‌, బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra)పై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మిస్‌ బార్బడోస్‌ లెయ్‌లానీ మెకనీ. ప్రపంచ సుందరి కిరీటాన్ని ప్రియాంక రిగ్గింగ్‌ చేసి సొంతం చేసుకుందని ఆమె అన్నారు. ఆనాటి ప్రపంచ సుందరి పోటీల గురించి వివరిస్తూ లెయ్‌లానీ వీడియో షేర్‌ చేసింది.

‘‘మిస్‌ బార్బడోస్‌గా నేను 2000లో జరిగిన ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొన్నాను. ఆ ఏడాది మిస్‌ ఇండియా (ప్రియాంక చోప్రా) ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. 1999, 2000.. ఇలా రెండేళ్ల పాటు ప్రపంచ సుందరి కిరీటం భారతదేశానికే దక్కడానికి స్పాన్సర్లే కారణం. ఎందుకంటే ఆ సంస్థ ఇండియాకు చెందినది. ముఖ్యంగా ప్రియాంకకు అక్రమంగా కిరీటం వరించింది. ఆమె అందగత్తె కాదు. రిహార్సల్స్‌లోనూ పాల్గొనలేదు. మధ్యాహ్నం పూట భోజనం కూడా ఆమె రూమ్‌కే వెళ్లేది. కానీ మిగిలిన వాళ్లందరికీ, అలా కాదు. ఆమెకు ప్రత్యేకంగా దుస్తులు డిజైన్‌ చేశారు. బీచ్‌లోనూ ఆమెకు స్పెషల్‌గా ఫొటోలు తీసి పేపర్లలో వచ్చేలా చేశారు. మిగిలిన వాళ్లందరినీ గుంపుగా తీశారు. ఇలా ఆ ఏడాది ప్రపంచ సుందరి పోటీల్లో ఫేవరెటిజం ప్రదర్శించారు’’ అని ఆరోపణలు చేసింది

మిస్‌ యూఎస్‌ఏ పోటీలకు సంబంధించిన వివాదం గురించి మాట్లాడుతూ లెయ్‌లానీ తాజాగా ఈ వీడియో షేర్‌ చేసింది. స్పాన్సర్‌ వల్లే మిస్‌ టెక్సాస్‌ ఆర్‌బానీ గాబ్రియేల్‌కు మిస్‌ యూఎస్‌ఏ కిరీటం వచ్చిందంటూ పోటీల్లో పాల్గొన్న ఇతర కంటెస్టెంట్స్‌ ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన లెయ్‌లానీ.. 2000 ప్రపంచ సుందరి పోటీల్లోనూ ఇలాగే జరిగిందంటూ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుని ప్రియాంకపై ఆరోపణలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని