Priyanka Chopra: అందుకోసమే ప్రియాంక దంపతులు రూ.149 కోట్లతో కొత్త ఇల్లు కొన్నారట!

సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ దంపతులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈవిషయంలో తమ గోప్యతకు భంగం కలిగించంకండి అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అయితే పుట్టింది అమ్మాయా లేదా అబ్బాయా అనే విషయాన్ని దంపతులు బయటపెట్టకపోగా..

Published : 26 Jan 2022 01:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ దంపతులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో తమ గోప్యతకు భంగం కలిగించకండి అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.కాగా, ప్రియాంక సోదరి మీరా చోప్రా ‘పాప’ పుట్టిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. జూనియర్‌ ప్రియాంక వచ్చేసిందంటూ ఫ్యాన్స్‌ ప్రియాంక- నిక్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇదిలా ఉండగా అమెరికా వీక్లీ ‘పీపుల్స్‌ మ్యాగజైన్‌’ ప్రియాంక- నిక్‌ ఫ్యామిలీ ప్లానింగ్‌ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. 2018లో వివాహబంధంతో ఒకటైన ఈ ఇద్దరు.. 2019లో అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో సెటిల్‌ అయ్యారు. పుట్టబోయే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మూడేళ్ల క్రితమే లాస్‌ ఏంజెల్స్‌లోని ఎన్‌సినో ఎస్టేట్స్‌ని కొనుగోలు చేశారట. దాని విలువ 20 మిలియన్ల డాలర్లు. (భారత కరెన్సీ ప్రకారం.. రూ.149 కోట్లు). ఈ ఇంటి కోసం నిక్‌ దంపతులు మూడు నెలలు శ్రమించారట.

ఇంత భారీగా ఖర్చు చేసి మరీ ఇల్లు కొనడం వెనుక ఓ బలమైన కారణం ఉందని చెబుతున్నారు ఈ ఇద్దరూ. పిల్లలతో గడిపే ప్రతీ క్షణం అమూల్యమైనదిగా భావించే..  వారిని దృష్టిలో పెట్టుకొనే ఇల్లు కొనుగోలు చేశామంటున్నారు. ముఖ్యంగా ఇంటి అవుట్‌డోర్‌ స్పేస్‌, చుట్టూ పచ్చదనం ఎక్కువ ఉండేలా చూసుకున్నారు. అందుకే అంత మొత్తం ఖర్చు చేయడానికి వెనుకాడలేదు. తమ కలలకు అనుగుణంగా ఇంటిలో మార్పులు చేశారు ఈ దంపతులు.

గతేడాది దీపావళి రోజున కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో ఇంటికి సంబంధించిన కొన్ని చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో దుర్గాదేవికి పూజ చేసి మా ఇంట్లో జరుపుకొంటున్న తొలి దీపావళి. ఇది ఎప్పటికీ మాకు స్పెషల్‌ అంటూ ఫొటోలను పోస్ట్‌ చేశారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని