Priyanka Chopra: శృంగార సన్నివేశాలు.. దర్శకుడి మాటలతో ఇబ్బందిపడ్డా: ప్రియాంకా చోప్రా
బాలీవుడ్‌లో తనకు ఎదురైన చేదు సంఘటనను బయటపెట్టారు నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra). ఓ దర్శకుడు తన గురించి ఇబ్బందికరంగా మాట్లాడాడని చెప్పారు.
ఇంటర్నెట్‌డెస్క్: బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ గత కొంతకాలంగా వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra). బాలీవుడ్‌లోని రాజకీయాలతో విసిగిపోయానని అందుకే హాలీవుడ్‌కు వెళ్లిపోయానని ఇటీవల చెప్పిన ఆమె తాజాగా బీటౌన్‌లో తనకు ఎదురైన చేదు సంఘటన గురించి పెదవి విప్పారు. ఓ సినిమా సెట్‌లో దర్శకుడి మాటలతో ఇబ్బందిపడినట్లు ఆమె తెలిపారు.
‘‘నేను బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొత్తలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంతకం చేశాను. అందులో నాది అండర్‌కవర్ ఏజెంట్ పాత్ర. సినిమా షూట్ మొదలైన రెండోరోజు నాపై ఓ శృంగార సన్నివేశాన్ని చిత్రీకరించాలని దర్శకుడు భావించాడు. నా స్టైలిష్ట్‌ని పిలిచి సీన్స్ గురించి ఆమెకు వివరించాడు. ‘‘ఈ సీన్స్‌లో ప్రియాంక లో దుస్తుల్లోనే కనిపించాలి. అలా, కాకపోతే ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు ఎందుకు వస్తారు?’’ అని ఇబ్బందికరంగా మాట్లాడాడు. ఆయన మాటలు నా వరకూ వచ్చాయి. నాకు అవమానంగా అనిపించింది. దాంతో ఆ సినిమా నుంచి బయటకువచ్చేశాను. నిర్మాతను పిలిచి డబ్బు వెనక్కి ఇచ్చేశాను’’ అని ప్రియాంక వెల్లడించారు.
సుమారు 15 ఏళ్లపాటు బాలీవుడ్ పరిశ్రమలో నటిగా రాణించారు ప్రియాంకా చోప్రా. కెరీర్ మొదలైన నాటి నుంచి అద్భుతమైన ప్రదర్శనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోన్న సమయంలోనే ఆమె ‘క్వాంటికో’ సిరీస్‌లో నటించారు. అది విజయం సాధించడంతో ఆమె హాలీవుడ్‌లో సెటిల్ అయ్యారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి
-
Politics News
Maharashtra: సీఎం ఏక్నాథ్ శిందేతో శరద్ పవార్ భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ!
-
India News
Pune: పీఎంఓ అధికారినంటూ కోతలు.. నకిలీ ఐఏఎస్ అరెస్టు!
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?
-
Movies News
Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్
-
India News
Fishermen: 200 మంది భారత జాలర్లకు పాక్ నుంచి విముక్తి!