Priyanka Chopra: హాలీవుడ్ సిరీస్.. ఆ విషయం చెప్పి చిక్కుల్లో పడతానేమో: ప్రియాంకా చోప్రా
హాలీవుడ్ సిరీస్ ‘సిటడెల్’ (Citadel) గురించి మాట్లాడారు నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra). ఈ సిరీస్ అందరికీ నచ్చుతుందని ఆమె అన్నారు. అనంతరం తాను తీసుకున్న పారితోషికం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్‌డెస్క్: నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) కీలకపాత్ర పోషించిన హాలీవుడ్ సిరీస్ ‘సిటడెల్’ (Citadel). నటుడు రిచర్డ్ మడెన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక.. పారితోషికం గురించి వైరల్ కామెంట్స్ చేశారు. రెండు దశాబ్దాల తన కెరీర్‌లో మొదటిసారి హీరోకి సమానంగా డబ్బు అందుకున్నట్లు చెప్పారు. రెమ్యునరేషన్ విషయంలో ఆనందంగా ఉన్నట్లు వెల్లడించారు.
‘‘పారితోషికం గురించి మాట్లాడి నేను సమస్యల్లో పడతానేమో. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్లు నా వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో తెలియదు. సుమారు 22 ఏళ్ల నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఉన్నాను. ఇప్పటివరకూ నేను దాదాపు 70 సినిమాలు, రెండు టీవీ షోలు చేశాను. కానీ, ‘సిటాడెల్’కు మాత్రమే హీరోకు సమానంగా రెమ్యునరేషన్ అందుకున్నాను. ప్రతి ప్రాజెక్ట్‌లో హీరోకు సమానంగా కష్టపడి పనిచేసినప్పటికీ అతి తక్కువ మొత్తంలో నాకు చెల్లించారు. అయితే, ‘సిటాడెల్’ను నిర్మించిన అమెజాన్ స్టూడియోస్ నాకు పారితోషికం అందిస్తూ.. ‘‘ఈ మొత్తానికి నువ్వు అర్హురాలివి. నువ్వు కూడా ప్రధాన పాత్రధారివి. దీనిని నువ్వు అందుకోవడం న్యాయమే’’ అని చెప్పింది. అది నిజమేననిపించింది’’ అని ఆమె పేర్కొంది. ఏప్రిల్ 28న ఇంగ్లిష్, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రైమ్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Vijayawada: న్యాయవాదిపై కేసు.. భవానీపురం సీఐను వీఆర్‌కు పంపిన సీపీ
-
India News
QR Code: సమాధిపై QR కోడ్.. కొడుకు జ్ఞాపకాలు చెదిరిపోకుండా తండ్రి ఆలోచన!
-
India News
PM Modi: జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచండి.. ప్రధాని మోదీ సూచన
-
Movies News
Naresh: నరేశ్ ఎప్పుడూ నిత్య పెళ్లికొడుకే..: రాజేంద్రప్రసాద్
-
World News
Ukraine: యుద్ధంలో కుంగిన ఉక్రెయిన్‌కు ఐఎంఎఫ్ 15 బిలియన్ డాలర్ల చేయూత!
-
India News
Padma awards: ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వీడియో వీక్షించండి