Priyanka Chopra: ఆ విషయంలో ఇప్పటికీ విచారిస్తున్నా: ప్రియాంక చోప్రా
ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో తెల్లగా ఉండే వాళ్ల సినిమాలు హిట్ అవుతాయనే అపోహ ఉండేదని తెలిపింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె కొన్ని ఫెయిర్‌నెస్ క్రీమ్స్ ఉత్పత్తుల్లో నటించినందుకు ఇప్పటికీ విచారిస్తున్నట్లు చెప్పింది.
హైదరాబాద్: బాలీవుడ్‌లో ఉన్న టాప్ హీరోయిన్స్‌లో ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) ముందు వరుసలో ఉంటుంది. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది అ అమ్మడు. తాజాగా తాను బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిపోవడం గురించి మాట్లాడి సంచలనం సృష్టించిన ప్రియాంక.. ఫెయిర్‌నెస్ క్రీమ్స్ ప్రకటనల్లో నటించడంపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. వాటి వల్ల నష్టం కలుగుతుందని చెప్పింది.
‘‘నేను చాలా సినిమాల్లో మేకప్ కారణంగా కొత్తగా కనిపించాను. తెల్లగా పాల రంగులో కనిపించే అమ్మాయిగా నటించడానికి చాలా కష్టపడ్డాను. కఠినమైన ఉత్పత్తులను వాడాను. నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో బాలీవుడ్‌లో ఓ అపోహ ఉండేది.. నటీనటులు తెల్లగా ఉంటే సినిమా విజయం సాధిస్తుందని అనుకునేవారు. అందుకే కొంచెం రంగు తక్కువగా ఉండే వాళ్లకు కూడా చాలా మేకప్ వేసి వాళ్లని తెల్లగా చూపించేవాళ్లు. అలా నాకు ఎన్నో సినిమాలకు మేకప్ వేశారు. నేను ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల ప్రకటనల్లో కొందరు స్టార్ హీరోలతో కలిసి నటించాను. అలాంటి ప్రకటనల్లో చేసినందుకు ఇప్పటికీ విచారిస్తున్నా. అది పెద్ద బ్యూటీ బ్రాండ్ అవ్వడం వల్ల అందులో నటించాల్సి వచ్చింది. చాలా మంది ఆ క్రీమ్‌ను ఉపయోగించేవాళ్లు’’ అని ప్రియాంక తెలిపింది. ఇక గతంలోనూ ప్రియాంక ఈ విషయం గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. తన చిన్నప్పుడు రంగు తక్కువ ఉన్న కారణంగా తాను అందంగా లేనని బాధపడినట్లు చెప్పిన ప్రియాంక.. కొన్ని సౌందర్య ఉత్పత్తులను ప్రచారం చెయ్యడం వల్ల విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Sudan: ఆకలికి తట్టుకోలేక 60 మంది చిన్నారులు మృతి.. పాలు లేక నీళ్లు తాగిస్తున్న దృశ్యాలు..!
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Viveka Murder case: సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన భాస్కర్‌రెడ్డి
-
World News
Vivek: చైనాలో ఎలాన్ మస్క్ పర్యటన ఆందోళనకరమే : వివేక్ రామస్వామి
-
Crime News
Vijayawada: ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం.. కృష్ణానదిలో దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
-
India News
Supreme Court: రూ.2వేల నోట్ల మార్పిడిపై పిటిషన్.. అత్యవసర విచారణకు సుప్రీం ‘నో’!