Priyanka Chopra: ‘ఆర్‌ఆర్ఆర్’ ఒక తమిళ చిత్రం: ప్రియాంకపై మండిపడుతున్న నెటిజన్లు
Priyanka Chopra: హిందీ సినిమాల్లో నటించి, తెలుగు కథానాయకుడు రామ్‌చరణ్‌తో కలిసి ఆడి పాడిన ప్రియాంక చోప్రా ‘ఆర్‌ఆర్ఆర్’ను తమిళ చిత్రం అంటూ వ్యాఖ్యానించడంపై నెటిజన్లు విమర్శకులు చేస్తున్నారు.
హైదరాబాద్: ఒకప్పుడు భారతీయ సినిమా అంటే విదేశీయులకు బాలీవుడ్‌గానే పరిచయం ఉంది. కానీ, దక్షిణాది దర్శకులు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. వరుస బ్లాక్‌బస్టర్ హిట్‌లు కొడుతున్నారు. అయినా కూడా ఇప్పటికీ చాలా మంది భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనే పరిస్థితి ఉంది. తెలియక విదేశీయులు అలా అనుకున్నా పర్వాలేదు కానీ, హిందీ సినిమాల్లో నటించి, తెలుగు కథానాయకుడి సరసన ఆడి పాడిన ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కూడా ‘ఆర్ఆర్‌ఆర్’(RRR)ను తమిళ సినిమా అని పేర్కొనడంతో నెటిజన్లు అందరూ ఆమెపై మండిపడుతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికన్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆర్ఆర్‌ఆర్’ను తమిళ చిత్రంగా పేర్కొన్నారు. వ్యాఖ్యాత ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ గురించి మాట్లాడుతూ.. బాలీవుడ్, హాలీవుడ్‌ను కొంతమంది స్టార్స్, స్టూడియోలు నియంత్రిస్తున్నాయని అన్నారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలకు మద్దతు పలికిన ప్రియాంక.. ‘ఒకప్పుడు పెద్ద స్టూడియోలు, ఐదుగురు పెద్ద నటులే పెద్ద సినిమాలు చేస్తారు. మిగిలిన వాళ్లకు ఆ అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇది స్ట్రీమింగ్ యుగం. సరికొత్త సినిమాలు తీయడానికి చాలా మంది ప్రజలకు అవకాశం దొరికింది. ఇప్పుడు బాలీవుడ్ అదే పంథాలో కొనసాగుతోంది’ అని చెబుతుండగా ‘మరి ఆర్‌ఆర్‌ఆర్’ అని వ్యాఖ్యత అనే సరికి ‘అది తమిళ చిత్రం. ‘అది కూడా పెద్ద సినిమానే. బ్లాక్‌బస్టర్ తమిళ చిత్రం ఇవన్నీ చేయగలిగింది. ఆ సినిమా భారతీయులకు అవెంజర్స్ లాంటిది’ అని ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది.
వ్యాఖ్యాత ‘ఆర్‌ఆర్ఆర్’ను బాలీవుడ్‌సినిమా అంటే సరిచేయబోయి ‘తమిళ సినిమా’ అంటూ ప్రియాంక మరింత తప్పుదారి పట్టారు. ఆస్కార్స్-2023 కోసం ప్రియాంక ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రమోట్ చేశారు. అవార్డు వచ్చిన తర్వాత చిత్ర బృందాన్ని అభినందించారు. అంతేకాదు, రామ్‌చరణ్‌తో కలిసి గతంలో ఆమె ‘జంజీర్’లో నటించారు. అది తెలుగులోనూ విడుదలైంది. ఇన్ని తెలిసి కూడా ఆమె ‘ఆర్‌ఆర్ఆర్’ను తమిళ చిత్రం అనడంపై నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ‘తెలుగు సినిమా అని తెలియకుండానే ఆస్కార్‌కోసం సపోర్ట్ చేశావా’ అంటూ మండిపడుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TS Government: ₹లక్ష ప్రభుత్వ సాయం.. అప్లై చేసుకోండిలా..
-
World News
Imran Khan: ఇక పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు..!
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. విద్యుత్ షాక్‌తోనే 40 మంది మృతి..!
-
Movies News
village backdrop movies: కథ ‘ఊరి’ చుట్టూ.. హిట్ కొట్టేట్టు!
-
Sports News
WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్.. షెడ్యూల్, ప్రైజ్‌మనీ...?
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు