RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్’ చూసేంత సమయం లేదు.. ఎందుకంటే..: ప్రియాంక చోప్రా
ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) చూడలేదని చెప్పింది. సమయం దొరకడం లేదని పేర్కొంది.
ముంబయి: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతోంది. అక్కడ వరుస సినిమాలతో గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న ఆమె ‘ఆర్‌ఆర్‌ఆర్’ పై చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ప్రపంచ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని ప్రియాంక ఇప్పటివరకు చూడలేదని తెలిపింది.
‘‘నాకు ఇప్పటి వరకు ‘ఆర్ఆర్‌ఆర్’ చూసేందుకు సమయం దొరకలేదు. నేను సినిమాలు ఎక్కువ చూడను. ఎప్పుడైనా సమయం ఉంటే టీవీల్లో వచ్చే కార్యక్రమాలు చూస్తుంటాను. కొన్ని షోలు మాత్రం క్రమం తప్పకుండా చూడడానికి ప్రయత్నిస్తాను’’ అని తెలిపింది. ఇక రామ్ చరణ్‌ను (Ram Charan) ‘బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తున్నారు. ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తారా అని అడగ్గా.. ‘‘కచ్చితంగా అంగీకరిస్తాను. రామ్ చరణ్ ఉత్సాహంగా ఉంటాడు. చాలా మంచి వ్యక్తి. ఒకవేళ మీరు రామ్ చరణ్, బ్రాడ్ పిట్ (Brad Pitt) వీళ్లిద్దరిలో ఎవరు అందంగా ఉంటారనే ప్రశ్న అడిగితే.. నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే నేను బ్రాడ్ పిట్ సినిమాలు చూస్తూ పెరిగాను. అతడు నా క్రష్’’ అని చెప్పింది. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు (NTR) ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారని తెలిపింది.
అయితే ఆమె ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) చూడలేదనే వ్యాఖ్యలపై నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ‘ఇప్పటి వరకు మూడు గంటల సమయం దొరకలేదా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రియాంక ఈ సినిమా విషయంలో ట్రోలింగ్‌కు గురవడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ఆర్‌ఆర్‌ఆర్’ని తమిళ సినిమా అని చెప్పడంతో విమర్శలు ఎదుర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Viveka Murder case: అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంలో మంగళవారం విచారణ
-
Movies News
Nayanthara: ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాం.. నయనతారకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన విఘ్నేశ్
-
India News
Biparjoy : మరో 36 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్న బిపర్ జోయ్
-
Sports News
Rishabh Pant: టీమ్ ఇండియా కోసం పంత్ మెసేజ్..!
-
World News
Donald Trump: మరిన్ని చిక్కుల్లో ట్రంప్.. రహస్య పత్రాల కేసులో నేరాభియోగాలు
-
Politics News
Eatala Rajender : దిల్లీ బయలుదేరిన ఈటల రాజేందర్