Priyanka Chopra: నేను సినిమాకి భారమనుకున్నా!: ప్రియాంక చోప్రా
బాలీవుడ్‌లో స్టార్ కథానాయిక హోదా అనుభవిస్తూనే.. హాలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక చోప్రా. కెరీర్ ప్రారంభించి ఇరవై ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ తన పాపులారిటీ తగ్గలేదు.
బాలీవుడ్‌లో స్టార్ కథానాయిక హోదా అనుభవిస్తూనే.. హాలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక చోప్రా. కెరీర్ ప్రారంభించి ఇరవై ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ తన పాపులారిటీ తగ్గలేదు. అయితే కెరీర్ మొదలైన కొత్తలో.. వైఫల్యాలు ఎదురైనప్పుడు నేను సినిమాకి భారంగా మారాను అని కలత చెందేదట. ఒకానొక సమయంలో నటించడం మానేద్దామనే ఆలోచన వచ్చేదట. ఆదివారం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వివరాలు పంచుకుంది. ‘నేను ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూసే రకం. ఏదైనా మంచి అవకాశం చేజారినా, నటించిన సినిమాలు ఫెయిలైనా చాలా బాధ పడేదాన్ని. అదంతా నా వైఫల్యమే అని కుంచించుకుపోయేదాన్ని. నటించాలా? వద్దా? అని సందేహపడేదాన్ని. ముఖ్యంగా నా కెరియర్ మొదలైన కొత్తలో నాకు ఎవరూ పెద్దగా తెలియదు. పెద్ద స్టార్లతో కలిసి నటించాలి అంటే భయం. అయితే తర్వాతర్వాత పరిస్థితి అర్థమైంది. నటించడమే తప్ప గెలుపోటముల గురించి పట్టించుకోవద్దనే విషయం తెలిసింది. అప్పట్నుంచి యాక్టింగ్‌ని ఎంజాయ్ చేస్తున్నా’ అని చెప్పుకొచ్చింది పీసీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/09/2023)
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేసిన ఇంటర్‌పోల్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
Andhra news: ఐబీ సిలబస్ విధివిధానాల కోసం కమిటీల ఏర్పాటు
-
Ram Pothineni: ‘స్కంద’ మాస్ చిత్రం మాత్రమే కాదు..: రామ్