Priyanka Jawalkar: పవన్‌ కల్యాణ్‌ అంటే పిచ్చి: ప్రియాంక

తెలుగులో పలు సినిమాలతో అలరించిన హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌(Priyanka Jawalkar) తనకు పవన్‌ కల్యాణ్‌ అంటే(Pawan Kalyan) ఎంతో ఇష్టమని తెలిపింది. కానీ పవన్‌తో కలిసి సినిమాల్లో నటించనని చెప్పింది. 

Published : 16 Jan 2023 15:40 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ హీరో విజయ్‌దేవరకొండ(Vijay Deverakonda) సరసన ‘ట్యాక్సీవాలా’(Taxiwaala) సినిమాలో నటించి క్రేజ్‌ను సొంతం చేసుకుంది ప్రియాంక జవాల్కర్‌(Priyanka Jawalkar).  ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి అలరించింది. ఈ అమ్మడుకి పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) అంటే ఎంత ఇష్టమో సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి తన అభిమాన హీరో గురించి తెలిపింది. పవన్‌ కల్యాణ్‌ అంటే చచ్చేంత ఇష్టమని చెప్పింది. ఆయన నటించిన తమ్ముడు సినిమా 20 సార్లు చూసిందిట. అలాగే ఖుషి సినిమాలోని అన్ని డైలాగులు అలవోకగా చెప్పేస్తానని అంటోంది.

‘‘అంతపెద్ద స్టార్‌ అయినా కూడా అంత సింపుల్‌గా ఎలా ఉంటారో నాకు అర్థం కాదు. ఆయన్ని దూరం నుంచి చూస్తూ అభిమానిస్తాను కానీ, ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చినా నేను దానికి అంగీకరించను. ఆయనతో కలిసి సినిమా మాత్రం చేయలేను. ఇలా దూరం నుంచి చూస్తూ.. ఎప్పటికీ ఆయన్ని అభిమానిస్తూ ఉండిపోతా. ఈ జీవితానికి అది తప్ప మరొకటి అవసరం లేదు’’ అని చెప్పింది. ఇక షార్ట్‌ ఫిల్మ్‌తో తన కెరీర్‌ ప్రారంభించిన ప్రియాంక విజయ్‌ సరసన నటించిన సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత ‘తిమ్మరుసు’, ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం’, ‘గమనం’ వంటి సినిమాల్లో కనిపించింది. ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మకు లక్షల్లో ఫాలోయర్స్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు