
Updated : 23 Jan 2022 07:00 IST
Priyanka Chopra: తల్లైన ప్రియాంక చోప్రా
ప్రముఖ కథానాయిక ప్రియాంక చోప్రా తల్లయ్యారు. సరోగసి పద్ధతిలో ప్రియాంక నిక్జొనాస్ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఈ జంట సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. ‘‘సరోగసీ ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ సమయం మాకెంతో ప్రత్యేకమైంది. ఈ ఆనందకర సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. దయచేసి మా గోప్యతకు భంగం కలిగించకండి. ధన్యవాదాలు’’ అని ఈ జంట రాసుకొచ్చింది. దీంతో సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి ప్రియాంక దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 2018తో ఈ జంట వివాహబంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం ప్రియాంక లాస్ ఏంజిలెస్లోనే నివాసం ఉంటుంది. పలు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూనే బాలీవుడ్లో సినిమాలు నిర్మిస్తోంది.
Tags :