bunny vasu: పవన్ ఆవేదనను వివరించాం
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. పూజాహెగ్డే నాయిక. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. పూజాహెగ్డే నాయిక. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమా అక్టోబరు 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత బన్నీవాసు మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..
మధ్యతరగతి కుర్రాడిగా అఖిల్
అఖిల్‌ని చూడగానే సంపన్న కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయిలాగా అనిపిస్తాడు. గత చిత్రాల్లో అలాంటి పాత్రలే పోషించాడు. ఇందులో మధ్య తరగతి కుర్రాడిలా కనిపిస్తాడు. పెళ్లికి ముందు ఏం నేర్చుకోవాలనేది మా సినిమా చూపిస్తుంది. పెళ్లైన తర్వాత కూడా పిల్లలకు ఏం నేర్పాలనేది సినిమా చూస్తే తెలుస్తుంది. అలాగని సందేశాలు ఇవ్వలేదు. ఏది చెప్పినా.. వినోదాత్మకంగానే చెప్పే ప్రయత్నం చేశాం. స్క్రిప్ట్ విషయంలో భాస్కర్ ఎక్కువ సమయం తీసుకుంటాడు. దర్శకుడిగా తనకు సంతృప్తి దొరికే వరకు కథపై కసరత్తులు చేస్తాడు. షూటింగ్ మాత్రం చాలా వేగంగా పూర్తిచేస్తాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ 85 రోజుల్లోనే చిత్రీకరణ జరుపుకొంది. కరోనా దెబ్బతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెండేళ్ల సమయం తీసుకుంది. భాస్కర్ మిగతా సినిమాలకన్నా ఎక్కువ వినోదాన్ని అందిస్తుందీ సినిమా.
అక్కినేని కుటుంబం మాకు కలిసొస్తుంది
మా బ్యానర్ మొదట్లోనే నాగచైతన్య మంచి ఆరంభమిచ్చాడు. ‘100% లవ్’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చాడు. అక్కినేని ఫ్యామిలీ గీతాఆర్ట్స్‌కి బాగా కలిసొస్తుంది. ఆ సెంటిమెంట్ పునరావృతం అవుతుందని ఆశిస్తున్నాం. అన్నిటికీ మించి ఒక మంచి సినిమాను అందిస్తున్నామనే నమ్మకముంది.
పవన్ ఆవేదనను వివరించాం
ప్రస్తుతం మేమంతా గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటున్నాం. సినిమా విడుదల చేయడం ఆర్థికంగా రిస్క్‌తో కూడుకున్నది. కానీ ఇంకా ఆలస్యం చేస్తే మా సంస్థకి, అఖిల్‌కి నష్టమని నా అభిప్రాయం. ఓటీటీల నుంచి గట్టి పోటీ ఉంది. మా బాధలన్నీ ప్రభుత్వానికి వివరించాం. వాళ్లు కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. ఒక మాటైతే ఇచ్చారు. కేసులు తగ్గగానే 100 శాతం ఆక్యుపెన్సీ ఉండేలా చూస్తామన్నారు. వీలైనంత త్వరగా అది అమల్లోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాం. పవన్ కల్యాణ్ తను అనుకున్నది చెబుతున్నారు. ఆయన ఆవేదనలోని విషయాన్ని మంత్రికి వివరించాం. ప్రభుత్వం చెబుతున్నది కూడా పవన్‌కి చెప్పాం. ఈ సమస్యను మరింత జఠిలం చేయొద్దని ఇరు వర్గాలను కోరాం. ఇద్దరూ పాజిటివ్‌గానే స్పందించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరు!
అన్ని థియేటర్లలోనూ పేటీఎమ్, బుక్‌మైషో, జస్ట్ టికెట్స్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ప్రభుత్వం మొత్తంగా బుకింగ్ కౌంటర్‌ను ఎత్తేస్తుందని భావన ప్రజల్లోకి వెళ్లింది. కానీ అది వాస్తవం కాదు. మొత్తం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుందని కాదు.. కానీ అర్ధరాత్రి పన్నెండు లోపు ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయి, ఎంత ఆదాయం వచ్చిందనే సమాచారం కోరుతుంది అంతే. సినిమా వ్యాపారాన్ని దెబ్బకొట్టాలని ఇలా చేయట్లేదు. కానీ కచ్చితమైన సమాచారం ఎలా ఇస్తారని అడుగుతున్నారు. ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. ఆన్లైన్ టికెట్ బుకింగ్‌పై ఇంకా చర్చలు జరుగుతున్నాయి.
తెలంగాణలో థియేటర్లన్ని ఒక క్రమపద్ధతిలో నడుస్తాయి. పన్ను కట్టడం చాలా మెరుగ్గా ఉంది. ఇక్కడున్న థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు దాదాపు కార్పొరేట్ సంస్థలవే. పన్ను ఎగ్గొట్టడానికి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితి లేదు. అక్కడ థర్డ్ పార్టీల ఆధ్వర్యంలో నడిచే థియేటర్లు ఎక్కువ. క్యాంటిన్, ట్యాక్స్ సేవింగ్ మీద ఆదాయం ఉంటుంది. థియేటర్లలో వచ్చే ఆదాయానికి చెల్లించే పన్నుకు చాలా తేడా ఉంది. ప్రభుత్వానికి పన్నులు కట్టనప్పుడు, కనీసం సామాన్య ప్రజలకు అందబాటులో టికెట్ రేట్లు ఉండాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకే ఎగ్జిబిటర్లను జీఎస్టీలో చేరమని కోరాం.
‘పుష్ప’ విడుదలైతే కానీ చెప్పలేం
అల్లు అర్జున్‌ని ఇంకొక స్థాయికి తీసుకెళ్లేలా ‘పుష్ప’ ఉంటుంది. తదుపరి చిత్రం ఏదనేది ఇంకా తెలియలేదు. ‘ఐకాన్’, బోయపాటి సినిమాల్లో ఏది ముందు మొదలవుతుందనే దానిపై స్పష్టత రాలేదు. మురుగదాస్‌తో అల్లుఅర్జున్ సినిమాపై చర్చలు నడుస్తున్నాయి. అనుకోకుండా ‘పుష్ప’ రెండు భాగాల్లో తెరకెక్కించే పరిస్థితి ఏర్పడింది. అది విడుదలైతే గానీ, మిగతా సినిమాలపై స్పష్టత రాదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం