C Kalyan: అది.. చిరంజీవి, బాలకృష్ణను అవమానించడమే: సి.కల్యాణ్‌

తమిళ, కన్నడ పరిశ్రమలో వాళ్ల సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు తెలుగు పరిశ్రమలోనూ తెలుగు చిత్రాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్మాత సి. కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు

Published : 10 Dec 2022 01:44 IST

హైదరాబాద్‌: వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) చిత్రాలకు థియేటర్లు ఇవ్వకపోవడం శోచనీయమని తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్ (C Kalyan) ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమకు ఎంతో మేలు చేస్తున్న ఇద్దరు అగ్ర హీరోలను పరిశ్రమ అవమానించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు వెంటనే స్పందించి తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే నిబంధనకు కట్టుబడి ఉన్నట్లు తెలపాలని కోరారు.

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగల సమయంలో అనువాద చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదనే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘తెలుగు నిర్మాతల మండలి ఎగ్జిబిటర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ విషయం పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది. సంక్రాంతికి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ (veera narasimha reddy), చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya)తోపాటు దిల్ రాజు తమిళంలో నిర్మించిన ‘వారిసు’ (వారసుడు) విడుదలకానుంది. అయితే, ‘వారసుడు’ (Varisu)కు ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారనే వాదన రావడంతో తెలుగు నిర్మాతల్లో ఆందోళన నెలకొంది. తమిళ, కన్నడ పరిశ్రమలో వాళ్ల సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చినప్పుడు తెలుగు పరిశ్రమలోనూ తెలుగు చిత్రాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి’’ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. తెలుగు వారే తెలుగు సినిమాను చంపుకోకూడదని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు