
Dil Raju: ఆ ఉద్దేశంతోనే ‘ఎఫ్ 3’ టికెట్ ధరలు తగ్గించాం: దిల్‌రాజు
ఇంటర్నెట్ డెస్క్: సినిమా టికెట్ ధరల తగ్గింపుపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) స్పందించారు. కరోనా తర్వాత చిత్ర పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయని, సినిమాల చిత్రీకరణ ఆగిపోయి బడ్జెట్లు పెరిగాయని అన్నారు. బడ్జెట్ పెరగడం వల్లే ‘ఆర్ఆర్ఆర్’ (RRR), ‘కేజీయఫ్ 2’ (KGF Chapter 2) సినిమాలకు టికెట్ ధరలు పెరిగాయని తెలిపారు. ప్రేక్షకులు ఓటీటీలో సినిమాలు చూసేందుకు అలవాటుపడ్డారని పేర్కొన్నారు. ధరల పెంపు వల్ల ప్రేక్షకులు థియేటర్‌కు దూరమవుతున్నారని చెప్పారు. ధరలు అందుబాటులో లేకపోవడం వల్ల రిపీట్ ఆడియన్స్ తగ్గిపోయారని వివరించారు. పాత జీవో ప్రకారం, ఎక్కువమంది ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలనే ఉద్దేశంతో తాను నిర్మించిన ‘ఎఫ్ 3’ (F 3) చిత్రానికి టికెట్ ధరలు తగ్గించామన్నారు. వెంకటేష్ (Venkatesh), వరుణ్‌తేజ్ (Varun Tej) హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రమిది. తమన్నా, మెహరీన్ కథానాయికలు. గతంలో మంచి విజయం అందుకున్న ‘ఎఫ్ 2’కు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం మే 27న విడుదలకానుంది. ఈ మేరకు టికెట్ ధరలను తగ్గిస్తున్నట్టు చిత్ర బృందం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!
-
Ap-top-news News
Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
-
Ap-top-news News
Andhra News: కలెక్టరమ్మా... కాలువల మధ్య ఇళ్లు కట్టలేమమ్మా!
-
Crime News
Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
-
General News
Heavy Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆత్మహత్యలే
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!