DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు(Dilraju) తండ్రయ్యారు. ఆయన సతీమణి తేజస్విని(Tejaswini) బుధవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. దీంతో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. దిల్‌రాజు మొదటి భార్య అనిత అనారోగ్య సమస్యలతో 2017లో కన్నుమూశారు. వీరికి హన్సితా రెడ్డి అనే కుమార్తె ఉంది. మొదటి భార్య మరణానంతరం ఆయన వరంగల్‌కు చెందిన తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో 2020లో వీరి వివాహం జరిగింది.
ఇక, సినిమాల విషయానికి వస్తే దిల్‌రాజుకు చెందిన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రెండు భారీ ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి విజయ్-వంశీపైడిపల్లి కాంబోలో రానున్న ‘వారసుడు’(Varasudu). మరొకటి రామ్‌చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Errabelli Pradeep Rao: తెరాసకు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు గుడ్‌బై
-
World News
Ukraine: జపరోషియా అణువిద్యుత్తు కేంద్రం దెబ్బతింది..!
-
Movies News
Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
-
Sports News
Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
-
India News
NITI Aayog: మోదీ అధ్యక్షతన ‘నీతి ఆయోగ్’ సమావేశం ప్రారంభం.. కేసీఆర్, నీతీశ్ గైర్హాజరు..
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం
- సూర్య అనే నేను...
- Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (07/08/2022)