Suriya: ఆ వార్తలను ఖండించిన సూర్య సినిమా నిర్మాత

తమ సినిమాపై వస్తోన్న వదంతులను నిర్మాత కలైపులి ఎస్‌. థాను ఖండించారు. అసత్యాలను నమ్మొద్దని హీరో సూర్య అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

Published : 24 Dec 2022 01:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూర్య (Suriya) హీరోగా దర్శకుడు వెట్రిమారన్‌ ‘వాడివాసల్‌’ (Vaadivaasal) అనే చిత్రాన్ని ఇటీవల ప్రకటించారు. ఇప్పటికీ చిత్రీకరణ ప్రారంభంకాకపోవడంతో ఆ సినిమా ఆగిపోయిందంటూ వదంతులు వ్యాపించాయి. దీనిపై కోలీవుడ్‌ మీడియా.. చిత్ర నిర్మాత కలైపులి ఎస్‌. థానును ప్రశ్నించగా ఆయన స్పందించారు. ఆ వార్తలను ఖండించిన ఆయన అలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని కోరారు. కొందరు పది నిమిషాల్లో ఫేమ్‌ పొందేందుకు అలా చేస్తుంటారని, సినీ అభిమానులు వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఆ చిత్రం ఇంకా ప్రీ ప్రొడక్షన్‌ దశలోనే ఉందని వెల్లడించారు.

సి. ఎస్‌. చెలప్ప రాసిన ‘వాడివాసల్‌’ అనే నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. తమిళనాడులో ప్రసిద్ధిగాంచిన జల్లికట్టు ఆటకు సంబంధించిన కథాంశంతో రూపొందనుంది. మరోవైపు, ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా నుంచి సూర్య వైదొలిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శివ డైరెక్షన్‌లో నటిస్తున్నారు సూర్య. టైటిల్‌ ఖరారుకాని ఆ చిత్రంలో బాలీవుడ్‌ నటి దిశా పటానీ కథానాయికగా సందడి చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని