Naga Vamsi: ‘గుంటూరు కారం’ పాటల విడుదలపై ప్రశ్న.. నిర్మాత సమాధానమేంటంటే?

తాను నిర్మించిన తాజా చిత్రం ‘ఆదికేశవ’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిర్మాత నాగవంశీ మాట్లాడారు. మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ పాటలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 20 Nov 2023 19:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహేశ్‌ బాబు (Mahesh Babu) హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). వచ్చే ఏడాది జనవరి 12న విడుదలకానున్న ఈ సినిమా పాటల కోసం మహేశ్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఓ పాట విశేషంగా అలరించిన సంగతి తెలిసిందే. ‘ఆదికేశవ’ (Aadikeshava) ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో.. మిలిగిన పాటల విడుదలపై ప్రశ్న ఎదురవగా నిర్మాత నాగవంశీ (Naga Vamsi) స్పందించారు. మరి, ఆయన ఏమన్నారంటే?

* ‘గుంటూరు కారం’ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఇంకా రిలీజ్‌కావాల్సిన పాటలున్నాయి. అవి విడుదలై శ్రోతలకు చేరువయ్యేందుకు టైమ్‌ సరిపోతుందంటారా?

నాగవంశీ: విడుదలకు ఇంకా మూడు పాటలున్నాయి. అవి అందరికీ చేరువయ్యేందుకు సమయం సరిపోతుంది. పాటలు అద్భుతంగా ఉంటాయి. వచ్చే ఏడాదంతా పాడుకునేలా ఉంటాయి. వచ్చేవారం రెండో పాటను రిలీజ్‌ చేస్తాం.

* ‘ఆదికేశవ’ మాస్‌ ఎంటర్‌టైనర్‌. ‘లియో’ సినిమాలో ఉన్నట్లు ఇందులో స్పెషల్‌ ఎలిమెంట్స్‌ ఏమైనా ఉన్నాయా?

నాగవంశీ: ‘లియో’లోని విజువల్స్‌, నేపథ్య సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ‘ఆదికేశవ’ విషయానికొస్తే.. వాటితోపాటు మంచి కామెడీ, పాటలు, యాక్షన్‌ సీక్వెన్స్‌ అదనం. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మళ్లీ అలాంటి పూర్తిస్థాయి మాస్‌ చిత్రాలు రాలేదు. ఇటీవల ‘భగవంత్‌ కేసరి’ వచ్చినా అందులో మరో జానర్‌ను టచ్‌ చేశారు. ‘ఆదికేశవ’ పూర్తిస్థాయి మాస్‌ సినిమా. 

* ఈ చిత్రాన్ని వైష్ణవ్‌తేజ్‌తోనే చేయాలనుకున్నారా? మరో హీరోని సంప్రదించారా?

నాగవంశీ: నేను కథ విన్నప్పుడే వైష్ణవ్‌తేజ్ అయితే బాగుంటుందని అనుకున్నా. ఆయన్నే ఎంపిక చేశాం.

వైష్ణవ్‌తేజ్‌ (Vaishnav Tej), శ్రీలీల (Sree Leela) జంటగా నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి తెరకెక్కించిన చిత్రమే ‘ఆదికేశవ’. నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల 24న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈవెంట్‌ నిర్వహించి ట్రైలర్‌ విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని