Narayandas Narang: ఏషియన్ థియేటర్స్ అధినేత నారాయణదాస్ నారంగ్ కన్నుమూత
నిర్మాత, చలనచిత్ర వాణిజ్య మండి అధ్యక్షకుడు నారాయణదాస్ నారంగ్ (76) కన్నుమూశారు.
హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత, చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు, ఏషియన్ మల్టీప్లెక్స్, థియేటర్స్ అధినేత నారాయణదాస్ నారంగ్ (76) కన్నుమూశారు. కొన్నాళ్లుగా తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆయన ఇటీవల స్టార్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని స్వగృహానికి తరలించారు. నాగార్జున, నిర్మాతలు సురేశ్‌బాబు, సుధాకర్‌రెడ్డి, సుప్రియ, దర్శకుడు శేఖర్ కమ్ముల తదితరులు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. నారాయణదాస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
1946 జులై 27న జన్మించిన నారాయణదాస్ డిస్ట్రిబ్యూటర్‌గా పలు విజయవంతమైన చిత్రాలు విడుదల చేశారు. శ్రీవెంకటేశ్వర పతాకంపై ‘లవ్‌స్టోరీ’, ‘లక్ష్య’ సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం.. నాగార్జునతో ‘ఘోస్ట్’, ధనుష్‌తో ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఇలా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మూవీ ఫైనాన్షియర్‌గా సినీ పరిశ్రమకు సేవలు అందించిన ఆయన అజాతశత్రువుగా పేరొందారు. నారాయణ్దాస్కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తనయులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
నారాయణ మృతి పట్ల తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
* ప్రదర్శనారంగంలో నిష్ణాతుడు, మాట మీద నిలబడే నిఖార్సైన మనిషి, నిబద్ధత కలిగిన వ్యక్తి, అపార అనుభవజ్ఞుడు, సినీ రంగంలో ఓ మహారథి, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్ మృతి పట్ల శ్రద్ధాంజలి. - చిరంజీవి.
* నారాయణదాస్ మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా. గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది. సినిమాపై ఆయనకున్న విజన్, ప్యాషన్ ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. - మహేశ్‌బాబు.
* నారాయణదాస్ నారంగ్ మృతి పట్ల చింతిస్తున్నా. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. నేను నటించిన కొన్ని చిత్రాలు ఆయన సంస్థ ద్వారా పంపిణీ అయ్యాయి. - పవన్ కల్యాణ్.
* నారాయణదాస్ లేరన్న వార్త నన్ను తీవ్రంగా బాధించింది. తెలుగు సినిమా, సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. - మంచు విష్ణు.
* నారాయణదాస్.. చిత్ర పరిశ్రమలోని అందరితో స్నేహపూర్వకంగా మెలిగే వ్యక్తి. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నా. - దర్శకుడు వి.వి. వినాయక్.
* నారాయణదాస్, ఆయన తనయుడు సునీల్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నారాయణదాస్ లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా. - నిర్మాత నల్లమలుపు బుజ్జి.
* నారాయణదాస్గారు సినీ ఇండస్ట్రీలో అజాతశత్రువుగా పేరొందారు . నైజాంలో ఎగ్జిబిటర్, పంపిణీదారులుగా విశేష సేవలందించారు. వారి మరణం విచారకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. - ఎమ్మెల్యే కొడాలి నాని.
* నారాయణదాస్ మృతి చెందారన్న విషయం నన్ను వ్యక్తిగతంగా బాధించింది. నైజాం డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన మంచి గుర్తింపు పొందారు. ఆయన దూరమవడం చాలా దురదృష్టం. వారి కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నా. - ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్‌పై బిగ్‌బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్‌బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్‌లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్‌ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్‌ఖాన్‌తో మోహన్‌లాల్
మోహన్‌లాల్ డ్యాన్స్‌ను షారుక్ ఖాన్ మెచ్చుకున్నారు. షారుక్‌పై మోహన్‌లాల్ ప్రశంసలు కురిపించారు. -
నిర్మాతల నుంచి పవన్‌కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మరి ఆయన నిర్మాతల నుంచి తీసుకున్న అప్పు ఎంతో తెలుసా? -
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
గతంలో ఓ ఆడిషన్లో తనకు ఎదురైన సంఘటన గురించి స్టార్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఎవరంటే? -
మలయాళ సినిమాల హిట్‌కు కారణమిదే: ఫహాద్ ఫాజిల్
మలయాళ చిత్రాలు వరుస విజయాలు అందుకోవడంపై నటుడు ఫహాద్ ఫాజిల్ ఆనందం వ్యక్తంచేశారు. కంటెంట్ కొత్తగా ఉన్న కారణంగా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయన్నారు. -
సిబ్బంది పెళ్లిలో సందడి చేసిన విజయ్ దేవరకొండ..
వ్యక్తిగత సిబ్బంది పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
మాధురి దీక్షిత్‌తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్‌లో తన కెరీర్‌కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్‌పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
మహేశ్‌బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్‌తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. చైనీస్, జపనీస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. -
నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్
‘రత్నం’ (Rathnam) రిలీజ్లో భాగంగా తాజాగా ఓ కాలేజీలో జరిగిన ఈవెంట్లో నటుడు విశాల్ (Vishal) పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి తనని ఉద్దేశించి వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. -
‘కల్కి’లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు!.. వైరలవుతోన్న వార్త
‘కల్కి’కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారమవుతోంది. ఇందులో పలువురు యంగ్ నటీనటులు భాగం కానున్నట్లు తెలుస్తోంది. -
లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. ఆ స్టార్ హీరోకు జోడీగా..?
గతేడాది వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు నటి శ్రీలీల (Sreeleela). కెరీర్ పరంగా ప్రస్తుతం కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ భామకు తాజాగా క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. -
డబ్బు కోసమే సల్మాన్ సోదరిని పెళ్లి చేసుకున్నానన్నారు: ఆయుష్ శర్మ
బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్‌ఖాన్ బామ్మర్దిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు ఆయుశ్ శర్మ. ఆయన హీరోగా నటించిన సరికొత్త చిత్రం ‘రుస్లాన్’. దీని ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్‌కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్‌డౌన్ బ్యాటర్‌గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ