Project K: పాన్‌ ఇండియా ప్రముఖులను ఒకే చోట కలిపిన అగ్ర నిర్మాణ సంస్థ

అమితాబ్‌ బచ్చన్‌(Amitab Bachchan), కె.రాఘవేంద్రరావు(Raghavendra rao), ప్రశాంత్‌నీల్(Prasanth Neel)‌, ప్రభాస్‌(Prabhas).. వీరంతా ఆయా రంగాల్లోనే కాదు భారత చలన చిత్రపరిశ్రమలోన.....

Published : 27 Jun 2022 15:31 IST

హైదరాబాద్‌: అమితాబ్‌ బచ్చన్‌(Amitab Bachchan), కె.రాఘవేంద్రరావు(Raghavendra rao), ప్రశాంత్‌నీల్(Prasanth Neel)‌, ప్రభాస్‌(Prabhas).. వీరంతా ఆయా భాషలతోపాటు భారత చలన చిత్రపరిశ్రమలోనూ పేరుపొందిన ప్రముఖులు. వీరందర్నీ ఒకేచోట కలిపింది టాలీవుడ్‌కు చెందిన అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్(Vyjayanthi Movies)‌. దీనికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ పాన్‌ ఇండియా ఫొటో వెనకున్న కథంటంటే..

సినీ నిర్మాణ రంగంలో దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ అనుభవం టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సొంతం‌. అశ్వినీదత్‌ (Ashwini Dutt) స్థాపించిన ఈ బ్యానర్‌పై ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలు ప్రేక్షకుల మది గెలుచుకున్నాయి. తాజాగా వైజయంతి మూవీస్‌ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K) స్టార్స్‌ ప్రభాస్‌, అమితాబ్‌, నాగ్‌అశ్విన్‌తోపాటు రాఘవేంద్రరావు, ప్రశాంత్‌నీల్‌, నాని, దుల్కర్‌ సల్మాన్‌ పాల్గొన్నారు. వీరంతా కలిసి కాసేపు సరదాగా సినీ విశేషాలు ముచ్చటించుకున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో తాజాగా బయటకు రాగా నెటిజన్లందరూ దీన్ని ‘పాన్‌ ఇండియా’ పిక్‌గా అభివర్ణిస్తున్నారు.

వైజయంతి మూవీస్‌ ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈసినిమాలో ప్రభాస్‌ హీరో. అమితాబ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక, వైజయంతి మూవీస్‌ సంస్థతో రాఘవేంద్రరావుకి మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన సూపర్‌హిట్‌, ఆల్‌టైమ్‌ మ్యాజికల్‌ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ఆ బ్యానర్‌ నుంచి వచ్చిందే. ‘మహానటి’, ‘సీతారామం’లతో దుల్కర్ సల్మాన్‌‌.. ‘దేవదాస్‌’తో నాని ఈ సంస్థలో సినిమాలు చేసినవారే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని