Project k: ప్రభాస్ అభిమానులకు శుభవార్త ‘ప్రాజెక్ట్-కె’ నుంచి అదిరే అప్‌డేట్
Project k: ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ‘ప్రాజెక్ట్-కె’ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది.
హైదరాబాద్: మహాశివరాత్రి సందర్భంగా ప్రభాస్ (Prabhas) అభిమానులకు ‘ప్రాజెక్ట్-కె’ (Project K) (వర్కింగ్ టైటిల్) చిత్ర బృందం సర్‌ప్రైజ్ ఇచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ఇది. దీపికా పదుకొణె (deepika padukone) కథానాయిక. అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోన్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న (project k release date) విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తెలిపింది. ఈ సినిమాకు సంబంధించి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. భారీ చేయి కింద పడి ఉండగా, ముగ్గురు వ్యక్తులు గన్స్‌తో చేయి వైపు గురి పెడుతూ నిలబడ్డారు. హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్‌ను తలపించేలా సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే తెలుస్తోంది. మరోవైపు ‘ప్రాజెక్ట్ కె’ (Project K) సినిమాను కూడా రెండు భాగాలుగా తీసుకొచ్చే అవకాశాలున్నట్టు సమాచారం. ఆ దిశగా చిత్రబృందం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై వారి నుంచి మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఎవరూ స్పృశించని కథతో.. అత్యాధునిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.
ప్రభాస్ అభిమానులకు నాలుగు నెలలకో పండగ..
తమ అభిమాన కథానాయకుడి నుంచి సినిమా ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్న ప్రభాస్ (Prabhas) అభిమానులకు ఈ ఏడాది బ్లాక్ బస్టర్ బొనాంజా తగిలినట్లే. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆది పురుష్’ (aadi purush). ప్రభాస్ ఇందులో రాముడిగా నటిస్తుండగా, సీత పాత్రలో కృతి సనన్ (kriti sanon) కనిపించనుంది. రావణ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాను వేసవి కానుకగా జూన్ 16న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ప్రశాంత్ నీల్ (prashanth neel) రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్’ (salaar). శ్రుతిహాసన్ (shruti haasan) కథానాయిక. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్స్‌ను ప్రకటించారు. ఇప్పుడు ‘ప్రాజెక్ట్-కె’ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించడంతో నాలుగు నెలలకో ప్రభాస్ సినిమా రానుంది. వీటితో పాటు మారుతీ దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు వస్తే, ప్రభాస్ అభిమానులకు అంతకుమించిన పండగ ఇంకేముంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC paper leak case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో 19 మందిని సాక్షులుగా చేర్చిన సిట్..
-
Movies News
Venky Kudumula: అందుకే ఆ జోడిని మరోసారి రిపీట్ చేస్తున్నా: వెంకీ కుడుముల
-
Politics News
Congress: ఓయూలో నిరుద్యోగ మార్చ్.. రేవంత్ సహా కాంగ్రెస్ నేతల గృహనిర్బంధం
-
India News
దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై.. సుప్రీంకు 14 విపక్ష పార్టీలు
-
Movies News
manchu manoj: ‘ఇళ్లల్లోకి వచ్చి ఇలా కొడుతుంటారండి’.. వీడియో షేర్ చేసిన మనోజ్
-
World News
WHO Vs Musk: మస్క్ X టెడ్రోస్.. ట్విటర్ వార్..!